ఈవారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు.. శుభం నుంచి రానా నాయుడు 2 వరకు కంప్లీట్ లిస్ట్

Published : Jun 09, 2025, 10:29 AM IST

ఈవారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సిరీస్ లు, చిత్రాలు, వాటి రిలీజ్ డేట్లు, ఏ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి లాంటి విషయాలు తెలుసుకోండి.   

PREV
110
ఈ వారం ఓటీటీ చిత్రాలు, సిరీస్ లు 

ఈ వారం ఓటీటీలో (జూన్ 9 నుంచి 15 వరకు) ప్రేక్షకులకు వినోదం అందించేందుకు పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు విడుదల కానున్నాయి. తెలుగు, మలయాళం, ఆంగ్ల భాషల్లో వివిధ జానర్లకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు పలు ఓటీటీ వేదికలపై స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతున్నాయి. వీటిలో రానా నాయుడు సిరీస్, సమంత శుభం చిత్రాలు కూడా ఉండడం విశేషం. ఈవారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సిరీస్ లు, చిత్రాలు, వాటి రిలీజ్ డేట్లు, ఏ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి లాంటి విషయాలు తెలుసుకోండి. 

210
రానా నాయుడు సీజన్ 2 (Netflix – జూన్ 13)

విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన రానా నాయుడు సిరీస్ మొదటి సీజన్ కి మంచి ఆదరణ లభించింది. దీనితో ఇప్పుడు రెండవ సీజన్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సీజన్‌లో కథ మరింత ఉత్కంఠభరితంగా సాగనుంది. రానాకు ఎదురైన కొత్త శత్రువు రావ్, తన కుతంత్రాలతో నాయుడు ఫ్యామిలీకి ప్రమాదంగా మారతాడు. ఈ సిరీస్‌లో యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు ప్రధానంగా ఉండనున్నాయి.

310
పదక్కలం (JioHotstar – జూన్ 10)

సూరజ్ వెంజారముడు, షరీఫుద్దీన్, సందీప్ ప్రదీప్ నటించిన మలయాళ ఫాంటసీ కామెడీ డ్రామా "పదక్కలం" థియేటర్లలో విజయవంతమైన రన్ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

410
టైటాన్: ది ఓషన్‌గేట్ డిజాస్టర్ (Netflix – జూన్ 11)

2023లో టైటానిక్ శిధిలాలని చూసేందుకు టూరిస్టులు వెళ్లిన ఓషన్‌గేట్ టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలిపోయింది. ఈ విషాదకర సంఘటన ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీ చిత్రం ఇది.

510
ఛీర్స్ టు లైఫ్ (Netflix – జూన్ 11)

నటి తాటి లోపెస్ ఇజ్రాయిల్ కి ప్రయాణం మొదలు పెడుతుంది. ఆమె కుటుంబ కథలు, ప్రేమ, జీవితం మీద అన్వేషణతో కూడిన కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. 

610
ఫ్లాట్ గర్ల్స్ (Netflix – జూన్ 12):

ఒకే అపార్ట్‌మెంట్‌లో నివసించే ఇద్దరు పోలీసు అధికారుల కుమార్తెల కథ ఈ చిత్రం. వారి లైఫ్ స్టైల్, స్నేహం అంశాలతో ఈ చిత్రం ఉంటుంది.

710
అండ్ ది బ్రెడ్‌విన్నర్ ఈజ్... (Netflix – జూన్ 12)

ఒక కుటుంబ భారం మోస్తున్న మహిళ చుట్టూ కథ నడుస్తుంది. కుటుంబ ఆశయాలు, బాధ్యతల మధ్య జీవన పోరాటాన్ని ఈ చిత్రంలో ప్రధానంగా చూపించారు.

810
డీప్ కవర్ (Prime Video – జూన్ 12)

లండన్ క్రైమ్ వరల్డ్‌లో పోలీసులకు సహాయం చేసే పాత్రల్లో బ్రైస్ డల్లాస్ హోవర్డ్, ఒర్లాండో బ్లూమ్ నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ఇది.

910
శుభం (JioHotstar – జూన్ 13)

సమంత తొలిసారి నిర్మాతగా మారి నిర్మించిన హారర్ కామెడీ చిత్రం శుభం. ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. భీమిలికి చెందిన యువకులు విచిత్రమైన పరిస్థితిల్లో వారి భార్యల నుంచి ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.  

1010
ఏ బిజినెస్ ప్రపోజల్ (Netflix – జూన్ 13)

ఒక సీఈవో కి, కంపెనీ రీసెర్చర్ కి మధ్య లవ్ స్టోరీగా ఈ సిరీస్ రూపొందింది. మొదట ఫేక్ డేట్‌గా మొదలైన వారి ప్రయాణం నిజాంగా ప్రేమగా ఎలా మారింది అనే అంశాలతో ఈ సిరీస్ ని రూపొందించారు.

Read more Photos on
click me!

Recommended Stories