ఆ రహస్యం నాన్న ఎవ్వరికీ చెప్పలేదు.. అఖిల్, చైతన్యకి అయినా చెప్పమని ఏఎన్నార్ ని అడిగిన నాగార్జున

Published : Jun 09, 2025, 08:43 AM IST

అక్కినేని నాగేశ్వరరావు చిన్నతనం నుంచి కష్టాలు అనుభవిస్తూ భారతదేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు. తమది పెద్ద కుటుంబం కావడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ఏఎన్నార్ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.

PREV
15
అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి సంబరాలు 

అక్కినేని ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతం పెళ్లి సంబరాల్లో ఉన్నారు. ఇటీవల అఖిల్ అక్కినేని, జైనబ్ వివాహం ఘనంగా జరిగింది. ఆదివారం రోజు గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కి సినీ రాజకీయ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అక్కినేని ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

25
ఏఎన్నార్ జీవిత కష్టాలు

అక్కినేని నాగేశ్వరరావు చిన్నతనం నుంచి కష్టాలు అనుభవిస్తూ భారతదేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు. తమది పెద్ద కుటుంబం కావడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ఏఎన్నార్ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. ఏఎన్ఆర్ తన పిల్లలని క్రమశిక్షణతో పెంచారు కానీ ఎప్పుడూ వాళ్ళకి తన కష్టాల గురించి చెప్పలేదట.

35
కుటుంబ సభ్యులు ఎవ్వరికీ చెప్పలేదు

తాను చిన్నతనంలో ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొన్నారు, నటుడిగా అవకాశం కోసం ఎలా ప్రయత్నించాను, అవకాశం వచ్చాక గుర్తింపు తెచ్చుకునేందుకు ఎలా కష్టపడ్డాను ఇలాంటి విషయాలు ఏవీ ఏఎన్నార్ తన కుటుంబ సభ్యులకు చెప్పలేదట. చిన్నతనంలో తమకి ఆహారంగా రాగులు, సజ్జలు మాత్రమే దొరికేవట. ఇంట్లో అమ్మ అన్నం వండితే ఆ రోజు పండుగలా అనిపించేదట. 

45
నాగార్జున ఎమోషనల్ కామెంట్స్

ఈ విషయాన్ని ఏఎన్నార్ సంతానం నాగార్జున, వెంకట్ నాగ సుశీల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మా కుటుంబం ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం నాన్నగారు కానీ ఆయన కష్టాన్ని మాతో ఎప్పుడూ చెప్పుకోలేదు. వేరే సందర్భాల్లో ఆయన ఈ విషయాలు చెబుతుంటే మాకు తెలిశాయి. నేరుగా ఎప్పుడూ ఆయన తన కష్టాల గురించి చెప్పుకోలేదు అని నాగార్జున అన్నారు. కనీసం మా పిల్లలకైనా ఆయన కష్టాల గురించి తెలియాలి అని నాగార్జున అన్నారు.

55
కనీసం అఖిల్, నాగ చైతన్యకి అయినా చెప్పాలి 

అందుకే ఓసారి అఖిల్ ని, నాగచైతన్య ని నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళాను. నాన్నగారితో.. నాన్న మీ లైఫ్ సీక్రెట్స్, మీ కష్టాలు ఎప్పుడూ మాకు చెప్పలేదు. మీ గురించి వీళ్లకు తెలియాలి. వీళ్ళకైనా ఆ విషయాలు చెప్పండి అని అడిగినట్లు నాగార్జున తెలిపారు. అప్పుడు నాన్నగారు.. అఖిల్, నాగచైతన్య ఇద్దరికీ తన జీవిత కష్టాలు వివరించారని నాగార్జున తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories