ఈవారం ఓటీటీ రిలీజ్ లు ఇవే..మయసభ, అరేబియా కడలితో పాటు మంచి కిక్కిచ్చే చిత్రాలు, సిరీస్ లు రెడీ

Published : Aug 04, 2025, 12:07 PM IST

ఈవారం ఓటీటీలో మయసభ, అరేబియా కడలి లాంటి ఆసక్తికర వెబ్ సిరీస్ లు, చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. మయసభ అయితే తెలుగు రాష్ట్రాల్లో సినీ రాజకీయ వర్గాలని ఆకర్షిస్తోంది. 

PREV
16
OTT Movies

ఈ వారం ఆగస్ట్ 4 నుండి 10 వరకు వివిధ ఓటీటీ లలో ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు, థ్రిల్లింగ్ మూవీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీలివ్, జియోహాట్‌స్టార్ వంటి ప్రముఖ డిజిటల్ సంస్థలు ప్రేక్షకుల కోసం మంచి వినోదం అందించే కంటెంట్ ని సిద్ధం చేస్తున్నాయి.

DID YOU KNOW ?
9 కిలోల బరువు పెరిగిన చైతన్య రావు
మయసభ వెబ్ సిరీస్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర కోసం నటుడు చైతన్య రావు 9 కిలోల బరువు పెరిగారట. 
26
నెట్ ఫ్లిక్స్ (Netflix)

వెడ్నస్డే సీజన్ 2: పార్ట్ 1 

ఈ సిరీస్ సూపర్ నేచురల్ అంశాలతో థ్రిల్లింగ్ సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఊహకందని మిస్టరీని వెడ్నెస్డే ఆడమ్స్ ఎలా ఛేదించింది అనేది కథ.  

రిలీజ్ తేదీ: ఆగస్ట్ 6 

స్టోలెన్: హైస్ట్ ఆఫ్ ది సెంచరీ

2003లో ఆంట్వర్ప్ డైమండ్ సెంటర్‌లో జరిగిన ప్రపంచ ప్రఖ్యాత దోపిడీపై ఆధారంగా ఈ డాక్యుమెంటరీ చిత్రం రూపొందించారు.

రిలీజ్ తేదీ: ఆగస్ట్ 8

36
ప్రైమ్ వీడియో (Prime Video)

ప్లాటానిక్ సీజన్ 2

మద్యవయసులో మళ్లీ కలుసుకున్న ఇద్దరు పాత స్నేహితుల జర్నీని ఈ సిరీస్ లో వినోదాత్మకంగా చూపించారు. .

రిలీజ్ తేదీ: ఆగస్ట్ 6

మిక్కీ 17

బాంగ్ జూన్ హో డైరెక్షన్‌లో రాబర్ట్ పాట్టిన్సన్ నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మిక్కీ 17. 

రిలీజ్ తేదీ: ఆగస్ట్ 7

అరేబియా కడలి

పాకిస్థాన్ సరిహద్దులు దాటి ప్రమాదాల్లో చిక్కిన ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందించారు. సత్యదేవ్, ఆనంది ఈ సిరీస్ లో జంటగా నటించారు. 

రిలీజ్ తేదీ: ఆగస్ట్ 8

46
జియో హాట్ స్టార్ (JioHotstar)

సలాకార్

స్పై యాక్షన్, అణ్వాయుధాల ప్రమాదం నేపథ్యంగా రూపొందిన ఇంటెలిజెన్స్ థ్రిల్లర్ జియో హాట్ స్టార్ లో రిలీజ్ అవుతోంది. 

రిలీజ్ తేదీ: ఆగస్ట్ 8

56
సోనీ లివ్ (SonyLIV)

మయసభ: ది రైజ్ ఆఫ్ టైటాన్స్ 

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన పొలిటికల్ డ్రామాగా ఈ సిరీస్ రూపొందింది. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డిల స్నేహం ఆధారంగా ఈ సిరీస్ రూపొందించినట్లు తెలుస్తోంది. 

రిలీజ్ తేదీ: ఆగస్ట్ 7

66
బాలుగాడి లవ్ స్టోరీ - ఆగస్ట్ 8న థియేటర్స్ లో విడుదల

ఈవారం థియేటర్స్ లో విడులవుతున్న చిత్రాల విషయానికి వస్తే.. బాలుగాడి లవ్ స్టోరీ అనే చిత్రం ఆగష్టు 8న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఆకుల అఖిల్, దర్శిక మీనన్, చిత్రం శ్రీను, గడ్డం నవీన్, చిట్టిబాబు, రేవతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'బాలుగాడి లవ్ స్టోరీ'. శ్రీ ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రానికి యల్. శ్రీనివాస్ తేజ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బాలుగాడి లవ్ స్టోరీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 8న విడుదల కాబోతోంది. ఈ సినిమాను 'సిల్వర్ స్క్రీన్' గణేష్ భారీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. దర్శకుడు ఎల్.శ్రీనివాస్ తేజ్ మాట్లాడుతూ....బాలుగాడి లవ్ స్టొరీ సినిమాను నిర్మాతలకు చెప్పిన వెంటనే నచ్చి వెంటనే ఓకే చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఆయన స్పూర్తి తోనే సినిమాను డైరెక్ట్ చేశాను, ఈ సినిమాలో కామెడీ, లవ్, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అందరూ నటీనటులు చాలా అనుభవం కిలిగిన వారిలాగా బాగా చేశారు. ఈ సినిమాతో ఆకుల అఖిల్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు, అతనికి మీ అందరి ఆదరణ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories