OTT: చెన్నై లవ్ స్టోరీతో పాటు మరో రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి.. ఈ వారం క్రేజీ సినిమాలు, సిరీస్ లు ఇవే

Published : Aug 17, 2026, 08:32 AM IST

ఈ వారం 5 వెబ్‌సిరీస్‌లు, 5 సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. లాంతర్న్స్, చెన్నై లవ్ స్టోరీ సహా మొత్తం 10 టైటిల్స్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మరో రొమాంటిక్ కామెడీ చిత్రం కూడా ఆడియన్స్ ని అలరించబోతోంది.

PREV
14
OTT Movies

ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం కూడా మంచి వినోదం అందించేందుకు పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ఆగస్టు 17 నుంచి వివిధ ఓటీటీలపై ఏకంగా 5 వెబ్‌సిరీస్‌లు, 5 సినిమాలు విడుదల కానున్నాయి. హాలీవుడ్‌ సూపర్‌హీరో కథ నుంచి క్రైమ్‌ థ్రిల్లర్లు, కొరియన్‌ మెడికల్‌ డ్రామా, తెలుగు రొమాంటిక్‌ డ్రామా, తమిళ రొమాంటిక్‌ కామెడీ, డాక్యుమెంటరీల వరకు విభిన్న జానర్లలో ఈ కంటెంట్‌ అందుబాటులోకి రానుంది.

24
జియోహాట్‌స్టార్

లాంతర్న్స్

డీసీ యూనివర్స్‌లో మూడో హెచ్‌బీఓ సిరీస్‌గా, జేమ్స్‌ గన్‌ షేర్డ్‌ యూనివర్స్‌లో ఐదో ఎంట్రీగా లాంతర్న్స్ తెరకెక్కింది. డీసీకి చెందిన ప్రముఖ పాత్రల్లో ఒకటైన గ్రీన్‌ లాంతర్న్‌ను కొత్త తరానికి పరిచయం చేసేలా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఆగస్టు 17 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

ఎక్కడ చూడాలి : జియోహాట్‌స్టార్

రిలీజ్ డేట్ : ఆగస్టు 17

ఇట్స్‌ ఆల్వేస్‌ సన్నీ ఇన్‌ ఫిలడెల్ఫియా సీజన్‌ 18

ప్రముఖ కామెడీ సిరీస్‌ ఇట్స్‌ ఆల్వేస్‌ సన్నీ ఇన్‌ ఫిలడెల్ఫియా 18వ సీజన్‌తో తిరిగి రానుంది. ప్యాడీస్‌ పబ్‌ మరోసారి కన్ఫ్యూజన్ డ్రామా క్రియేట్ చేయనుంది. కొత్త సీజన్‌ ఎపిసోడ్‌లు ఆగస్టు 18 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నాయి.

ఎక్కడ చూడాలి : జియోహాట్‌స్టార్

రిలీజ్ డేట్ : ఆగస్టు 18

34
సోనీలివ్

చెన్నై లవ్‌ స్టోరీ

కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియారెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు రొమాంటిక్‌ డ్రామా చెన్నై లవ్‌ స్టోరీ. ప్రేమ, అనురాగం, సంబంధాల చుట్టూ సాగే ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన తర్వాత ఓటీటీలోకి వస్తోంది.

ఎక్కడ చూడాలి : సోనీలివ్

రిలీజ్ డేట్ : ఆగస్టు 21

44
నెట్‌ఫ్లిక్స్

ఫేసింగ్‌ ఎల్‌ చాపో

వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్‌ డ్రామా ఫేసింగ్‌ ఎల్‌ చాపో. దొంగిలించిన కారును ఆపే క్రమంలో ఇద్దరు మెక్సికన్‌ పోలీసు అధికారులు అపఖ్యాతి చెందిన డ్రగ్‌ లార్డ్‌ ఎల్‌ చాపోను ఎదుర్కొంటారు. స్పానిష్‌ భాషలో రూపొందిన ఈ థ్రిల్లర్‌ ఆగస్టు 21 నుంచి డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుంది.

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్

రిలీజ్ డేట్ : ఆగస్టు 21

ప్యార్‌ ప్రేమ కల్యాణం

ప్యార్‌ ప్రేమ కల్యాణం ఒక రొమాంటిక్‌ కామెడీ. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అయిన పవి పెళ్లి తర్వాత కూడా తన కుటుంబ ఇంటిని వదిలి వెళ్లడానికి ఇష్టపడదు. సంప్రదాయానికి భిన్నంగా ఆమె భర్తగా నటించిన ఎలన్‌ ఆమె ఇంట్లోనే ఉండటానికి వస్తాడు. సాన్వీ మేఘనా, ఎలన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ చిత్రం ఆగస్టు 21 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్

రిలీజ్ డేట్ : ఆగస్టు 21

ఎస్‌&ఎక్స్‌

కొరియన్‌ మెడికల్‌ డ్రామా ఎస్‌&ఎక్స్‌లో ఇచిటో షిమోటోరి అనే వ్యక్తి షిమోటోరి క్లినిక్‌లో సెక్స్‌ థెరపిస్ట్‌గా పనిచేస్తుంటాడు. ఇతరులతో చెప్పుకోలేని సన్నిహిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు అతను చికిత్స అందిస్తుంటాడు. తన వృత్తిపై ఉన్న వివక్షను ఎదుర్కొంటూనే రోగులకు సహాయం చేసే కథతో ఈ సిరీస్‌ తెరకెక్కింది.

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్

రిలీజ్ డేట్ : ఆగస్టు 20

బ్లడ్‌ సాక్రిఫైస్‌

ఐదు భాగాలుగా రూపొందిన స్వీడిష్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ బ్లడ్‌ సాక్రిఫైస్‌. తన సహచర పోలీసుల వరుస హత్యలపై ఓ పోలీసు అధికారి దర్యాప్తు చేసే కథతో ఈ సిరీస్‌ సాగుతుంది.

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్

రిలీజ్ డేట్ : ఆగస్టు 20

టేక్‌ ఎ హైక్‌

ప్రముఖ నిర్మాత నా యంగ్‌సుక్‌ అందిస్తున్న కొత్త అడ్వెంచర్‌ రియాలిటీ సిరీస్‌ టేక్‌ ఎ హైక్‌. హైకింగ్‌పై ఏమాత్రం ఆసక్తి లేని నలుగురు ప్రముఖులను దక్షిణ కొరియాలో మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య కఠినమైన శీతాకాల యాత్రకు తీసుకెళ్తారు. ఈ సిరీస్‌ ఆగస్టు 18 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్

రిలీజ్ డేట్ : ఆగస్టు 18

చోంపూ: లాస్ట్‌ & ఫర్గాటెన్‌

థాయ్‌లాండ్‌లోని ముక్దహాన్‌ ప్రావిన్స్‌లో ఆరేళ్ల క్రితం మృతదేహంగా కనిపించిన మూడేళ్ల చిన్నారి నోంగ్‌ చోంపూ కేసు ఆధారంగా ఈ డాక్యుమెంటరీ రూపొందింది. చిన్నారి అదృశ్యం, దర్యాప్తు, ఆ తర్వాత ఈ కేసు చుట్టూ ఏర్పడిన మీడియా హంగామాను ఈ చిత్రం పరిశీలిస్తుంది.

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్

రిలీజ్ డేట్ : ఆగస్టు 20

ఫ్రీఫాల్‌: ఎ రికనింగ్‌ ఫర్‌ బోయింగ్‌

బోయింగ్‌ విసిల్‌బ్లోయర్‌ జాన్‌ బార్నెట్‌ మరణం నేపథ్యంలో రూపొందిన ఫ్రీఫాల్‌: ఎ రికనింగ్‌ ఫర్‌ బోయింగ్‌ డాక్యుమెంటరీలో బోయింగ్‌ సంస్థకు సంబంధించిన పలు అంశాలను పరిశీలించారు. సంస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం, భద్రతా లోపాలు, 737 మ్యాక్స్‌ ప్రమాదాల అనంతర పరిణామాలు, అంతర్గత వర్గాల వెల్లడిలను ఇందులో ప్రస్తావించారు. ఆగస్టు 19 నుంచి ఇది స్ట్రీమింగ్‌ కానుంది.

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్

రిలీజ్ డేట్ : ఆగస్టు 19

Read more Photos on
click me!

Recommended Stories