హిట్ కోసం మిస్టరీ హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో `అగధ`ని రూపొందించిన ఎంఎస్ రాజు
కమర్షియల్ గా హీరో కొట్టాలని, దర్శకుడిగా సక్సెస్ కావాలనే తపనతో మిస్టరీ హర్రర్ థ్రిల్లర్ `అగధ` చిత్రాన్ని రూపొందించారు ఎంఎస్ రాజు. హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు కంటెంటే బాగుంటే మంచి ఆదరణ పొందుతాయి. హిట్ కొట్టడం ఈజీ. దీంతో ఎంఎస్ రాజు కూడా అదే ప్లాన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించగా, శ్రావణ్ రెడ్డి, భానుచందర్, వనితా విజయ్ కుమార్, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. ఈ మూవీ గత శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది.