OTT: పూజ ఎవ‌రు? ఆ ప‌ర్సుతో ఆమెకు సంబంధం ఏంటి.? ఓటీటీని షేక్ చేస్తున్న మిస్ట‌రీ క్రైమ్ థ్రిల్ల‌ర్

Published : Dec 24, 2025, 04:39 PM IST

OTT: ఓటీటీ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత భాష‌తో సంబంధం లేకుండా సినిమాల‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కంటెంట్ ఉండాలే కానీ భాష‌తో సంబంధం లేద‌ని కొన్ని మూవీస్ నిరూపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీని షేక్ చేస్తోంది. 

PREV
15
క్రైమ్ థ్రిల్ల‌ర్‌కు పెరుగుతోన్న ఆద‌ర‌ణ

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అడుగుపెట్టాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన కంటెంట్ డిజిటల్ స్ట్రీమింగ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా క్రైమ్, థ్రిల్లర్ జానర్ మూవీస్‌కు మంచి ఆదరణ కనిపిస్తోంది. అలాంటి వాటిలో ఓ మలయాళ థ్రిల్లర్ సినిమా ప్రస్తుతం ఓటీటీని షేక్ చేస్తూ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

25
ట్రెండింగ్ నంబర్ వన్ మలయాళ థ్రిల్లర్

థియేటర్లలో విడుదలైన కొన్ని నెలలకే ఈ మలయాళ మూవీ ఓటీటీలోకి వచ్చి టాప్ ట్రెండింగ్ స్థానాన్ని దక్కించుకుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలోనూ ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఊహించిన దానికంటే మెరుగైన వసూళ్లు సాధించింది.

35
తక్కువ బడ్జెట్.. భారీ వసూళ్లు

కేవలం రూ.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.18 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కంటెంట్ బలంగా ఉంటే బడ్జెట్ అడ్డంకి కాదని మరోసారి నిరూపించిన చిత్రంగా ఇది నిలిచింది. థ్రిల్లర్ ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఈ మూవీలో ఉన్నాయని చెప్పాలి.

45
ఇంత‌కీ క‌థేంటంటే.?

ఈ సినిమా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. డొమినిక్ అనే మాజీ పోలీస్ ఆఫీసర్ కథ చుట్టూ కథనం తిరుగుతుంది. పోలీస్ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత అతడు ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతుంటాడు. అతడికి విఘ్నేష్ సహాయకుడిగా పనిచేస్తుంటాడు. ఒకరోజు డొమినిక్‌కు ఓ మహిళల పర్స్ దొరుకుతుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే ప్రయత్నంలో ఓ యువతి మిస్సింగ్ కేసు బయటపడుతుంది. ఆ యువతి పేరు పూజ అని తెలుస్తుంది. అక్కడినుంచి కథ ఆసక్తికర మలుపులు తిరుగుతుంది.

55
సస్పెన్స్, ట్విస్టులతో నిండిన కథనం

పూజ ఎవరు? ఆమె మిస్సింగ్‌కు ఆ పర్స్‌కు సంబంధం ఏమిటి? ఆమె బాయ్‌ఫ్రెండ్ కార్తీక్ ఏమయ్యాడు? ఈ కేసులో అతడి పాత్ర ఏంటి? అసలు పూజకు ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాకు గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వం వహించాడు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించాడు. గోకుల్ సురేష్, సుష్మిత భట్, విజి వెంకటేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇష్ట‌ప‌డేవారికి ఇది బెస్ట్ ఛాయిస్‌గా చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories