ఈవారం థియేటర్స్, ఓటీటీలో రిలీజ్ అయ్యే క్రేజీ చిత్రాలు ఇవే..నాగార్జున కుబేర నుంచి గ్రౌండ్ జీరో వరకు..

Published : Jun 16, 2025, 10:52 AM IST

ఈవారం ఇటు థియేటర్స్ లో అటు ఓటీటీలో కొన్ని ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆ చిత్రాల వివరాలు తెలుసుకుందాం.  

PREV
16
ఈవారం థియేటర్స్, ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు

ప్రతి వారం ఓటీటీలో కొత్త చిత్రాలు రిలీజ్ అవుతూ ఆడియన్స్ కి వినోదాన్ని అందిస్తున్నాయి. ఇతర భాషా చిత్రాలు, వెబ్ సిరీస్ లకు కూడా ఓటీటీలో తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అదే విధంగా ఈ వారం కుబేర లాంటి క్రేజీ చిత్రాలు థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

26
థియేటర్స్ లో రిలీజ్ అయ్యే చిత్రాలు

కుబేర : కింగ్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన కుబేర చిత్రం జూన్ 20న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. డబ్బు, పవర్ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి అనే కథాంశంతో శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని రూపొందించారు. 

సితారే జమీన్ పర్ : క్రీడా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఆర్.ఎస్ ప్రసన్న తెరకెక్కించారు. అమీర్ ఖాన్ తన సొంత ప్రొడక్షన్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. జెనీలియా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ తెలుగులో కూడా జూన్ 20న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. 

8 వసంతాలు : అవంతిక సానిల్ కుమార్, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించిన 8 వసంతాలు చిత్రం జూన్ 20న రిలీజ్ అవుతోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఫణీంద్ర రూపొందించారు. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. 

36
నెట్‌ఫ్లిక్స్‌లో..

ది హోల్డోవర్స్ (The Holdovers) – జూన్ 16న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్న ఈ చిత్రం, ఒక ప్రైవేట్ బోర్డింగ్ స్కూల్‌లో క్రిస్టమస్ బ్రేక్ సమయంలో విద్యార్థులను పర్యవేక్షించాల్సిన ప్రొఫెసర్ చుట్టూ తిరుగుతుంది. పౌల్ జియామట్టి ప్రధాన పాత్రలో నటించారు.

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 (The Great Indian Kapil Show 3) – కపిల్ శర్మ, అర్చనా పూరణ్ సింగ్, సునీల్ గ్రోవర్, కికూ శార్దా, కృష్ణ అభిషేక్‌లతోపాటు శాశ్వత అతిథిగా నవజోత్ సింగ్ సిద్ధూ చేరతారు. జూన్ 21 నుంచి ఈ రియాలిటీ షో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది.

46
ప్రైమ్ వీడియోలో..

వి వెర్ లయర్స్ ( We Were Liars)  – ఈ మిస్టరీ డ్రామా సిరీస్ జూన్ 18న ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ధనవంతుల కుటుంబానికి చెందిన 17 ఏళ్ల కేడీ సింక్లేర్ గతంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకునే క్రమంలో ఎదురయ్యే మానసిక తడబాట్ల కథాంశంతో ఈ సిరీస్ రూపొందించారు.

గ్రౌండ్ జీరో (Ground Zero) – ఇమ్రాన్ హాష్మీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన దాడి అనంతరం జరిగిన ప్రతీకార కథతో రూపొందించబడింది. జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ ఘాజీ బాబాను ఎదిరించే BSF కమాండర్ నరేంద్ర నాథ్ ధర్ డుబే ఎలా దేశానికి గొప్ప విజయం అందించారోఈ చిత్రంలో చూపించారు. ఇది జూన్ 20న ప్రైమ్ వీడియోలో విడుదలవుతుంది.

56
జీ 5లో

డిటెక్టివ్ షెర్డిల్ (Detective Sherdil) – దిల్జిత్ దోశాంజ్ ఈ చిత్రంలో ఫన్నీగా ఉండే డిటెక్టివ్ పాత్రలో నటించారు. బుడాపెస్ట్‌లో జరిగిన ఒక పారిశ్రామికవేత్త హత్యకేసును ఛేదించేందుకు అతడు చేసే ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. జూన్ 20న ZEE5లో స్ట్రీమ్ అవుతుంది.

ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ  (Prince and Family) – మలయాళ నటుడు దిలీప్, మంజు పిళ్ళై ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. వివాహం తర్వాత అతడి జీవితం ఎలా మారింది అనే కుటుంబ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇది ZEE5లో జూన్ 20న విడుదలవుతుంది.

66
జియో హాట్‌స్టార్‌లో..

కేరళ క్రైమ్ ఫైల్స్ (Kerala Crime Files S2) – పోలీస్ స్టేషన్లో ఉద్యోగంలో ఉన్న యువ పోలీస్ అధికారిణి అనూహ్యంగా అదృశ్యమవడం చుట్టూ ఈ క్రైమ్ థ్రిల్లర్ కథ సాగుతుంది. జూన్ 20న జియో హాట్‌స్టార్‌లో ప్రసారమవుతుంది.

ఫౌండ్ సీజన్ 2 (Found Season 2 )– గత దశాబ్దాల్లో మాయమైన పిల్లల కేసులు ఆధారంగా ఈ సిరీస్ కథ సాగుతుంది. జూన్ 20న జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories