రాజమౌళి ప్లానా మజాకా... 6 విభాగాల్లో ఆస్కార్స్ బరిలోకి RRR, అటు నుంచి నరుక్కొస్తున్న జక్కన్న..!

First Published Sep 21, 2022, 1:54 PM IST


ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆస్కార్స్ అంటూ పెద్ద చర్చ జరుగుతున్న క్రమంలో ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్ ఇచ్చింది. జ్యూరీ సభ్యులు ఆస్కార్ నామినేషన్స్ కి ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఎంపిక చేయలేదు. ఆర్ ఆర్ ఆర్, కాశ్మీర్ ఫైల్స్ చిత్రాలను కాదని గుజరాతీ చిత్రం చెల్లో షో(లాస్ట్ ఫిలిం షో)ని ఎంపిక చేశారు. 


ఫిలిం ఫెడరేషన్ సభ్యులకు ఇది కామన్ హ్యాబిట్ గా మారిపోయింది. హైప్ తో పాటు ప్రజల్లోకి వెళ్లిన చిత్రాలను కాదని అంతగా ప్రజాదరణ పొందని చిత్రాలను ఎంపిక చేసి పంపుతున్నారు.గతంలో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటిన 'ది లంచ్ బాక్స్' చిత్రాన్ని కాదని ''ది గుడ్ రోడ్' చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్స్ కి పంపారు. అలాగే ''ది డిసిఫుల్'' పక్కన పెట్టి యాక్షన్ థ్రిల్లర్ ''జల్లికట్టు'' చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్స్ కి ఇండియా తరపున పంపారు. ఈ రెండు చిత్రాలు ఎంట్రీ దక్కించుకోలేకపోయాయి. 


ఇన్నేళ్ల ఇండియన్ మూవీ ఆస్కార్ జర్నీ పరిశీలిస్తే కేవలం మూడు చిత్రాలు మాత్రమే నామినేట్ అయ్యాయి. మదర్ ఇండియా(1955), సలామ్ బాంబే(1988), లగాన్(2001) చిత్రాలు ఆస్కార్ కి నామినేట్ అయ్యాయి. ఒక్క లగాన్ మాత్రమే గట్టిపోటీ ఇచ్చింది. అవార్డ్స్ మాత్రం దక్కలేదు. 

RRR Movie


అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న ఆర్ ఆర్ ఆర్ ని ఎంపిక చేసి నామినేషన్స్ కి పంపడం ద్వారా ఆ కోరిక తీరుతుందని భావించారు. ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ ఆర్ ఆర్ ఆర్ ని పక్కన పెట్టడం నిరాశ పరిచింది. ఆర్ ఆర్ ఆర్ పలు విభాగాల్లో అవార్డ్స్ అందుకోగల సత్తా ఉన్న చిత్రంగా హాలీవుడ్ ప్రముఖులు సైతం అభివర్ణిస్తున్నారు. 
 

RRR Movie

అమెరికాలో ఆర్ ఆర్ ఆర్ 1200 థియేటర్స్ లో విడుదల చేశారు. అలాగే ఎంపిక చేసిన 200 థియేటర్స్ లో రీరిలీజ్ చేశారు. యూఎస్ లో $14 మిలియన్ డాలర్స్ వసూళ్లు అందుకున్న ఆర్ ఆర్ ఆర్... నెట్ఫ్లిక్స్ లో 14 వారాలు టాప్ టెన్ లో కొనసాగింది. ఇక వరల్డ్ వైడ్ ఆర్ ఆర్ ఆర్ రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సాంకేతికంగా అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఆస్కార్ నామినేషన్స్ లో లేకపోవడం శోచనీయం.

RRR Movie

ఆర్ ఆర్ ఆర్ మేకర్స్  తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆర్ ఆర్ ఆర్ యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఆస్కార్ అవార్డు క్యాంపైన్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 10000 మంది అకాడమీ సభ్యుల అభిప్రాయ సేకరణ చేయనున్నారు. వివిధ విభాగాల్లో ఆర్ ఆర్ ఆర్ పై అకాడమీ సభ్యుల మధ్య ఓటింగ్ నిర్వహించనున్నారు. 
 

బెస్ట్ డైరెక్టర్(రాజమౌళి), ఒరిజినల్ స్క్రీన్ ప్లే(రాజమౌళి అండ్ విజయేంద్ర ప్రసాద్), లీడ్ యాక్టర్(రామ్ చరణ్, ఎన్టీఆర్) సపోర్టింగ్ యాక్టర్(అజయ్ దేవగణ్) సపోర్టింగ్ యాక్ట్రెస్(అలియా భట్), ఒరిజినల్ సాంగ్)నాటు నాటు), ఒరిజినల్ స్కోర్(ఎం ఎం కీరవాణి), సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్,  ఎడిటింగ్, కాస్ట్యూమ్ డిజైన్, మేకప్ అండ్ హెయిర్ స్టైల్, సౌండ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో నామినేషన్స్ సబ్మిట్ చేయనున్నారు.

ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ అకాడమీ సభ్యులు వీక్షించే చిత్రాల లిస్ట్ లో లేదు. అయితే మెజారిటీ ఓటింగ్ సాధించి బిగ్ స్క్రీన్ పై ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శన చేయాలనేది మేకర్స్ స్ట్రాటజీగా తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఆస్కార్ బరిలో దించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వెతుకుతున్నారు. ఎలాగైనా ఆర్ ఆర్ ఆర్ కి ఆస్కార్ తేవాలని ప్రయత్నం  చేస్తున్నారు. 
 


అకాడమీ నిబంధనల ప్రకారం లాస్ ఏంజెల్స్ నగరంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వారం రోజులు ప్రదర్శించిన ఏ చిత్రమైనా జనరల్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ కి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఆ విధంగా ఆర్ ఆర్ ఆర్ నామినేషన్స్ కి అకాడమీ సభ్యులు అప్లై చేసి .. వారిని మెప్పించి ఆస్కార్ బరిలో దిగవచ్చు. 

ఆర్ ఆర్ ఆర్ విడుదలై ఆరు నెలలు దాటిపోయినా గ్లోబల్ వైడ్ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. దీన్ని విజువల్ వండర్ గా అభివర్ణిస్తున్నారు. హాలీవుడ్ మేకర్స్ సైతం మెచ్చుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ కి భారత్ నుండి అధికారిక ఎంట్రీ లభించకున్నా, బరిలో నిలవడం ఖాయం అంటున్నారు. మరి వేచి చూడాలి మేకర్స్ ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో...

click me!