సమంతకి అనారోగ్యం..అమెరికాలో ట్రీట్‌మెంట్‌.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్‌

Published : Sep 21, 2022, 01:19 PM IST

స్టార్‌ హీరోయిన్‌ సమంత అనారోగ్యంతో బాధపడుతుందని, ఆమె చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుందని పుకార్లు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో తాజాగా మేనేజర్‌ స్పందించారు. క్లారిటీ ఇచ్చారు. 

PREV
15
సమంతకి అనారోగ్యం..అమెరికాలో ట్రీట్‌మెంట్‌.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత అనారోగ్యానికి గురైందని, ఆమె అమెరికాలో చికిత్స తీసుకుంటున్నట్టు వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సమంతకి ఏమైంది? అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పైగా గత రెండు నెలలుగా సమంత కనిపించడం లేదు. దీంతో ఈ అనుమానాలకు, రూమర్లకి బలం చేకూరినట్టయ్యింది. 
 

25

తాజాగా దీనిపై సమంత మేనేజర్‌ స్పందించారు. సమంత అనారోగ్యంపై వస్తోన్న వార్తలను మేనేజర్‌ ఖండించారు. సమంతకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. సమంత ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ నిజం కాదని, ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, రూమర్స్ ని నమ్మవద్దని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సమంత అమెరికాలో ఉండటానికి కారణమేంటనేదానిపై మేనేజర్‌ క్లారిటీ ఇవ్వలేదు. 

35
Samantha ruth prabhu

ఇదిలా ఉంటే సమంత స్కిన్‌ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె గత కొంత కాలంగా `పాలీమర్‌ ఫోర్స్ లైట్‌ ఎరప్షన్‌` అనే స్కిన్కి సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, దీంతో ఆమె సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చి చికిత్స కోసం అమెరికా వెళ్లారని, దాదాపు రెండు నెలలు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటుందని వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. 

45

దీని కారణంగా తాను నటించాల్సిన `ఖుషి` సినిమా షూటింగ్ కి బ్రేక్‌ ఇచ్చిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేనేజర్ స్పందించి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత తెలుగులో మూడు సినిమాలు చేస్తుంది. `శాకుంతలం`, `యశోద` చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటున్నాయి. ఇటీవల `శాకుంతలం` నుంచి ఓ అప్‌డేట్‌ వచ్చిన విషయం తెలిసిందే. 

55

మరోవైపు విజయ్‌ దేవరకొండతో కలిసి `ఖుషి` చిత్రంలో నటిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుంది. దీంతోపాటు హిందీలోకి ఎంట్రీ ఇస్తూ ఆయుష్మాన్‌ ఖురానాతో ఓ సినిమా చేస్తుంది. అలాగే మరో రెండు స్టార్‌ హీరోల సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. అలాగే ఓ ఇంటర్నేషనల్‌ మూవీ చేయబోతుంది సమంత. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories