ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు అంటే కచ్చితంగా ఏదో తప్పు చేస్తున్నాడు అని అనుకుంటుంది రుక్మిణి.ఈ మాటలన్నీ విన్న జానకమ్మ, నేనే కదా చిన్మయి జాతకం వెళ్లి రాయించాను నాగదోషమని నాకు పంతులుగారు చెప్పలేదు కదా,దాని జాతకం చాలా బాగుందని చెప్పారు కదా అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్ లో దేవుడమ్మ సత్య దగ్గరికి వెళ్లి,సత్య బాధపడొద్దమ్మా ఆదిత్య నీ దగ్గరికి వస్తాడు. ఎవరికైనా ఏకాంత సమయంలో ఉన్నప్పుడు, లేకపోతే భర్త తో గడపాలనుకున్నప్పుడు మధ్యలో ఎవరైనా వస్తే కోపం ఉంటుంది.