డిఫరెంట్ జానర్స్:
బార్బీ-ఓపెన్ హైమర్ భిన్నమైన చిత్రాలు. డిఫరెంట్ జానర్స్ లో తెరకెక్కాయి. ఓపెన్ హైమర్ ఫాదర్ ఆఫ్ ఆటంబాంబ్ జే. రాబర్ట్ ఓపెన్ హైమర్ బయోపిక్. విధ్వంసానికి కారకుడైన వ్యక్తి కథ. వరల్డ్ వార్ 2లో గెలుపు కోసం భౌతిక శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ అణుబాంబు సృష్టిస్తాడు. అది మానవాళికి ఎంతటి నష్టం చేస్తుందో సృష్టించిన ఆయనకు కూడా తెలియదు. ఆ ప్రయోగంతో ప్రపంచం నాశనం కావచ్చు. ఇంతటి ప్రమాదకర అణుబాంబు తయారీ, ప్రయోగం... దాని వెనుక ఓపెన్ హైమర్ మానసిక సంఘర్షణ సమాహారంగా ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఓపెన్ హైమర్ పాత్రను సిల్లియన్ మర్ఫీ చేశారు.
బార్బీ ఫాంటసీ కామెడీ ఫిల్మ్. గ్లామర్ కి చిరునామాగా బార్బీ డాల్స్ ని చెబుతారు. నిజంగా బార్బీ డాల్స్ కోసం ఒక లోకం ఉంటే... తన లోకం వదిలి సదరు బార్బీ డాల్ భూలోకంలో అడుగు పెడితే ఎలా ఉంటుంది. బార్బీ డాల్ పట్ల మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది. అసలు బార్బీ తన ప్రపంచం వదిలి భూలోకంలోకి ఎందుకు వచ్చింది? వంటి విషయాల సమాహారం. అవుట్ అండ్ అవుట్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్. బార్బీ చిత్రంలో మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్ ప్రధాన పాత్రలు చేశారు.