ఖతర్నాక్ అవుట్ ఫిట్ లో మిల్క్ బ్యూటీ మైండ్ బ్లోయింగ్ లుక్.. గుచ్చే చూపులతో కలవరపెడుతున్న తమన్నా

First Published | Jul 19, 2023, 2:26 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannnaah Bhatia)  వరుస పోస్టులతో నెట్టింట అందాల దుమారం రేపుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. లేటెస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. 
 

టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా దుమ్ములేపిన విషయం తెలిసిందే. ‘హ్యాపీడేస్’ తో మొదలైన ఈ ముద్దుగుమ్మ ప్రయాణం ఇప్పటి వరకు నిరంతరాయంగా కొనసాగుతోంది. కొద్దికాలంగా ఈ ముద్దుగుమ్మకు హిట్స్ లేక కాస్తా ఇబ్బంది ఎదుర్కొంది. ప్రస్తుతం మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది.  
 

బడా స్టార్స్ సరసన నటిస్తూ మిల్క్ బ్యూటీ అదరగొడుతోంది. ప్రేక్షకులు ఊహించని విధంగా పెర్ఫామెన్స్ అందిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో బోల్డ్ నటనతోనూ మతులు పోగొడుతోంది. రీసెంట్ గా బెడ్ సీన్స్, కిస్ సీన్లలో నటించి సెన్సేషన్ గా మారింది.
 


రీసెంట్ గా ఓటీటీల్లోకి వచ్చిన ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ వంటి సిరీస్ ల్లో తమన్నా బోల్డ్ పెర్ఫామెన్స్ పెద్ద చర్చగా మారింది. ఇన్నాళ్లు అలాంటి సన్నివేశాలకు దూరంగా ఉన్న తమన్నా ఒక్కసారిగా హద్దులు దాటేయడంతో అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు ఆడియెన్స్ కూడా షాక్ కు గురయ్యారు. 
 

మరోవైపు సోషల్ మీడియాలోనూ తమన్నా అందాల దుకాణం తెరిచింది. గతంతో పోల్చితే ప్రస్తుతం కాస్తా టెంప్టింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ మతులు చెడగొడుతోంది. అలాగే డిఫరెంట్ అవుట్ ఫిట్లు ధరిస్తూ తన ఫ్యాషన్ సెన్స్ నూ చూపిస్తోంది. నయా లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. 

తాజాగా తమన్నా భాటియా కిర్రాక్ లుక్ లో దర్శనమిచ్చింది. బ్లాక్ అండ్ వైట్ చారల వంటి సూట్ లో మెరిసింది. ఓ హోటల్ రిసెప్షన్ హాల్ లో స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. కిల్లింగ్ ఫోజులిచ్చి చూపు తిప్పుకోకుండా చేసింది. మరోవైపు గుచ్చే చూపులు, మత్తు కళ్లతో మైమరిపించింది. 
 

లేటెస్ట్ ఫొటోలను లైక్స్, కామెంట్లతో ఫ్యాన్స్ వేరల్ చేస్తున్నారు. కొద్ది సేపట్లోనే లక్షల్లో లైక్స్ దక్కడం విశేషం. ఇదిలా ఉంటే తమన్నా ప్రస్తుతం చిరంజీవి సరసన ‘భోళా శంకర్’లో అలరించబోతోంది. అలాగే తమిళ సూపర్ స్టార్ రజినీతో ‘జైలర్’లోనూ నటిస్తోంది. రీసెంట్ గా మూవీ నుంచి విడుదలైన సాంగ్ కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అలాగే హిందీలోనూ పలు సినిమాలు చేస్తోంది. 
 

Latest Videos

click me!