స్లీవ్ లెస్ బ్లౌజ్.. చీరకట్టులో కట్టిపడేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్ అలియా భట్.. బ్యూటీఫుల్ లుక్

First Published | Jul 19, 2023, 1:25 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt)  ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో దర్శనమిచ్చింది. 
 

‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దుమ్ములేపడంతో పాటు ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్’ అవార్డును కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 
 

ఈ సందర్భంగా అలియాకు దేశ వ్యాప్తంగా మరింతగా క్రేజ్ దక్కించుకుంది. నార్త్ లో ఇప్పటికే నాటుకుపోయిన ఈ స్టార్ భామ RRRతో ఇటు దక్షిణాది ఆడియెన్స్ లోనూ మంచి క్రేజ్ దక్కించుకుంది. తొలిచిత్రంతోనే భారీ బ్లాక్ బాస్టర్ అందుకున్న హీరోయిన్ గా నిలిచింది. 


ఇదిలా ఉంటే.. గతేడాది బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ తో అలియా వివాహం గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో హిందూ సంప్రదాయ పద్ధతుల్లో వీరి పెళ్లి వేడుకగా అంగరంగ వైభవంగా జరిగింది. అదే ఏడాది చివరల్లో పండంటి ఆడబిడ్డకు కూడా జన్మిచ్చి తల్లిగా ప్రమోషన్ పొందింది. 
 

పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా అలియా భట్ సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతం మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టారు. అలియా చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి రన్బీర్ సింగ్ సరసన ‘రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’, రెండోది హాలీవుడ్ ఫిల్మ్ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లో నటిస్తోంది. 
 

ప్రస్తుతం Rocky aur Rani kii prem kahaani  చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కరణ్ జోహార్ దర్శకుడు ఈనెల 28న రిలీజ్ కానుండటంతో ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అలియా భట్ తీరొక్క చీరలో మెరుస్తూ ఫ్యాన్స్ ను, నెటిజన్లను కట్టిపడేస్తోంది. 
 

తాజాగా స్కై బ్లూ కలర్ శారీలో మెరిసింది. చీరకట్టులో తెలుగు అమ్మాయిలా కనువిందు చేసింది. అదిరిపోయే స్టిల్స్ ఇస్తూ ఆకట్టుకుంది. మరోవైపు స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి గ్లామర్ మెరుపులు మెరిపించింది. కొంటె పోజులతో చూపుతిప్పుకోకుండా చేసింది. మత్తు చూపులతో మైమరిపించింది. దీంతో ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!