ఆన్‌లైన్‌ ఎంగేజ్‌మెంట్‌..ఏంటీ పరిస్థితి? యాంకర్‌ ఝాన్సీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Published : May 03, 2021, 10:17 AM IST

యాంకర్‌ ఝాన్సీ పెళ్లిళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై అంతా ఆన్‌లైన్‌ కాబోతుందన్నారు. ఇలాంటి పరిస్థితిపై అసహనం వ్యక్తం చేసిన ఆమె పలు ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. 

PREV
15
ఆన్‌లైన్‌ ఎంగేజ్‌మెంట్‌..ఏంటీ పరిస్థితి? యాంకర్‌ ఝాన్సీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
కరోనా నేపథ్యంలో అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. చిత్ర పరిశ్రమ ఓ రకంగా లాక్‌డౌన్‌ పాటిస్తుంది. అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు పెళ్లిళ్లపై కూడా దీని ప్రభావం పడింది. దీనిపై నటి, యాంకర్‌ ఝాన్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డైరెక్ట్‌గా ఎంగేజ్‌మెంట్‌కి హాజరు కాలేకపోయిన స్థితి గురించి ఆమె స్పందించారు.

25
తాజాగా యాంకర్‌ ఝాన్సీ బంధువులకు సంబంధించి, పుత్ర సమానుడైన వ్యక్తి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. దానికి ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన బంధువులంతా ఆన్‌లైన్‌లోనే వీక్షించారు. అందులో ఝాన్సీ కూడా ఉన్నారు.టెక్నాలజీని ప్రశంసించిన ఝాన్సీ, ఇలాంటి పరిస్థితిపై ఆమె అసంతృప్తిని వెల్లడించారు.

35
ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయాఫోటోలను పంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు ఝాన్సీ. ఇది చాలా కష్టంగా ఉందని తెలిపింది. అదే సమయంలో ఇది విచిత్రంగా అనిపించిందని పేర్కొంది.

45
`మనందరం ఎన్నో కారణాల వల్ల కరోనా వైరస్‌ని ద్వేషిస్తున్నాం. నేను మాత్రం ఎంగేజ్‌మెంట్‌కి హాజరు కాలేకపోయినందుకు వైరస్‌ని తిట్టుకుంటున్నా. పుత్ర సమానుడైన సంపత్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. దాన్ని నేను ఆన్‌లైన్‌లో వీక్షించాను. ఈ నిశ్చితార్థ వేడుక కేవలం ఇరు కుటుంబ సభ్యులు మధ్య మాత్రమే జరిగింది. దీని కంటే ముందు వారంతా కరోనా టెస్ట్ చేయించుకోగా, నెగటివ్‌ అని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా నాతో పాటు 300 మంది ఈ ఎంగేజ్‌మెంట్‌ని ఆన్‌లైన్‌లోనే వీక్షించారు.

55
ఇది భలేగా, కొత్తగా ఉన్నా.. నేర్చుకుంటున్నాం. కొంత కష్టంగానే ఉంది. కానీ తప్పడం లేదు` అని అసంతృప్తిని వ్యక్తం చేసింది ఝాన్సీ. ప్రస్తుతం ఝాన్సీ నటిగా `ఎఫ్‌3`, `తిమ్మరుసు` చిత్రాల్లో నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories