మోనాల్‌ గజ్జర్‌ బిగ్‌బాస్‌ క్రేజ్‌ ఐటెమ్‌ సాంగ్‌కే పరిమితమా?..ఇంకా ఈ హాట్‌ బ్యూటీ అఖిల్‌ మోజులోనే ఉందా?

First Published | May 2, 2021, 7:05 PM IST

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ కంటెస్టెంట్‌ మోనాల్‌ గజ్జర్‌ క్రేజ్‌ పడిపోతుందా? ఈ అమ్మడి గ్లామర్‌ ఐటెమ్‌ సాంగ్‌కే పరిమితమా? ఈ గుజరాతీ భామ ఇంకా అఖిల్‌ మోజులోనే ఉందా? ప్రస్తుతం ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ క్వశ్చన్స్ సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి.
 

బిగ్‌బాస్‌ 4తో పాపులర్‌ అయిన వారిలో మోనాల్‌ గజ్జర్‌ ఒకరు. అఖిల్‌ సార్థక్‌తో ఈ అమ్మడు నడిపించిన ప్రేమాయణం, సాగించిన రొమాన్సే అందుకు కారణంగా చెప్పొచ్చు. తరచూ గ్లామర్‌ షో చేస్తూ ప్రేక్షకులను కనువిందు చేసింది మోనాల్‌.
బిగ్‌బాస్‌4 విన్నర్‌ అభిజిత్‌, అఖిల్‌ల మధ్య వివాదం, అందుకు మోనాల్‌ కారణం కావడంతో హౌజ్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా, నిత్యం అందరి ఫోకస్‌ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది మోనాల్‌. బహుశా ఇది బిగ్‌బాస్‌ స్ట్రాటజీ కూడా కావచ్చు. మొత్తానికి అందరి చూపులు తనవైపు తిప్పుకుందీ అందాల భామ.

బిగ్‌బాస్‌ పూర్తయిన తర్వాత కూడా అఖిల్‌తో లవ్‌ స్టోరీ కంటిన్యూ చేస్తుంది. తరచూ వీరిద్దరు కలుసుకోవడం, మాట్లాడుకోవడం చేస్తున్నారట. ఇటీవల వీరిద్దరు వీడియో కాల్‌లో ఛాట్‌ చేసుకున్నారట. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతున్నారని, ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఇచ్చుకుంటూ తెగ ఎంజాయ్‌ చేశారు. ఈ వీడియోని వీరే సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. దీంతో ఇది వైరల్‌ గా మారింది.
త్వరలోనే అంటే ఈ నెల 13న మోనాల్‌ బర్త్ డే. ఈ సందర్భంగా ఓ స్పెషల్‌ పర్సన్‌ని కలవబోతున్నట్టు తెలిపింది. ఆయనతో కలిసి ఫుడ్‌ షేర్‌ చేసుకోబోతుందట. దీంతో ఆ పర్సన్‌ ఎవరనేది ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అఖిలేనా? లేక ఇంకా ఎవరైననా అనేది సస్పెన్స్ గా మారింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మోనాలో అఖిల్‌తో కలిసి `తెలంగాణ అబ్బాయి గుజరాత్‌ అమ్మాయి` అనేవెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉందట. మరోవైపు మోనాల్‌ స్టార్‌ మాలోనే `డాన్స్ ప్లస్‌` షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. బిగ్‌బాస్‌ పూర్తి కాగానే ఆ బ్యూటీ `అల్లుడు అదుర్స్`లో ఐటెమ్‌ సాంగ్‌ చేసి ఓ ఊపు ఊపింది.
దీంతో మోనాల్‌ జోరు మొదలైందని అంతా అనుకున్నారు. కానీ అనుకున్నట్టు జరగలేదు. ఆ సినిమా పరాజయం చెందడమో, లేక అందులో మోనాల్‌ అందాలు అంతగా పండలేదో ఏమోగానీ ఈ అమ్మడికి మళ్లీ ఇంకా ఎలాంటి ఆఫర్స్ రాలేదు.
అయితే మోనాల్‌ బిగ్‌బాస్‌కి ముందు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. మళ్లీ తనని హీరోయిన్‌గా పెద్ద సినిమాల్లో తీసుకుంటారని, స్టార్‌ హీరోయిన్‌ అయిపోతుందని భావించగా, అలా జరగలేదు. ఇప్పటి వరకు ఎలాంటి సినిమా అవకాశాలు మోనాల్‌ తలుపు తట్టలేదు. దీంతో మోనాల్‌ బిగ్‌బాస్‌ క్రేజ్‌ కేవలం ఒక్క ఐటెమ్‌ సాంగ్‌కే పరిమితమయ్యిందా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇది గ్రహించిందో ఏమోగానీ మోనాల్‌ ఇటీవల వరుసగా సోషల్‌ మీడియా వేదికగా హాట్‌ షోకి తెరలేపింది. కుర్రాళ్లని తన ఎద అందాలతో కవ్విస్తూ వీడియోలు పంచుకుంటూ, ఇలా చూసైనా తనకు అవకాశాలు వస్తాయని ఈ అమ్మడు భావిస్తున్నట్టు తెలుస్తుంది.మరి మన మేకర్స్ పెద్ద మనసు చేసుకుంటారా? మోనాల్‌కి సినిమా అవకాశాలు వస్తాయా? అన్నది చూడాలి.

Latest Videos

click me!