అనంతరం టిల్లు స్క్వేర్ వసూళ్ల వర్షం కురిపించింది. అయితే సమ్మర్ సీజన్ సప్పగా సాగింది. సార్వత్రిక ఎన్నికలు, ఐపీఎల్ ఈవెంట్స్ నేపథ్యంలో పెద్ద చిత్రాల విడుదల ఆగిపోయింది. చాలా చిన్న చిత్రాలు వచ్చిపోయాయి. ఒక దశలో తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూత పడ్డాయి. ఈ క్రమంలో కల్కి విడుదల, దాని విజయం పై పరిశ్రమ మనుగడ ఆధారపడి ఉందని పలువురు అభిప్రాయ పడ్డారు.