ఆర్ ఆర్ ఆర్ నుండి కీలక సమాచారం లీక్, టెన్షన్ లో రాజమౌళి.. పండగ చేసుకుంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

First Published Jun 26, 2021, 8:57 AM IST

ఆర్ ఆర్ ఆర్ నుండి అదిరిపోయే న్యూస్ అందింది. ఆ సినిమాకు సంబంధించిన మరో కీలక విషయం లీకైంది. ఆర్ ఆర్ ఆర్ లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేస్తుండగా, ఆ పాత్ర ఏమిటో తెలిసిపోయింది. 

ఆర్ ఆర్ ఆర్ నుండి మరో కీలక అంశం లీక్ కావడంతో రాజమౌళి అసహనంగా ఉన్నారట.  రాజమౌళి ఫీల్ అవుతున్నప్పటికీ బయటికి వచ్చిన న్యూస్ మాత్రం గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేటెస్ట్ లీక్ తో పండగ చేసుకుంటున్నారు.
undefined
ఆర్ ఆర్ ఆర్ నుండి ఎటువంటి లీక్స్ బయటికి రాకుండా రాజమౌళి పలు జాగ్రత్తలు తీసుకుంటారు. సెట్స్ లో ఎవరినీ ఆయన మొబైల్ ఫోన్స్ తీసుకురానివ్వరు.
undefined
అయితే అవుట్ డోర్ షూటింగ్ సమయంలో మాత్రం లీక్స్ జరుగుతున్నాయి.  గతంలో ఎన్టీఆర్ లుక్ తో పాటు ఆయన పులితో ఫైట్ వంటి కీలక విషయాలు లీక్ కావడం జరిగింది. తాజాగా ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న చక్రి అనే చైల్డ్ ఆర్టిస్ట్ కారణంగా అజయ్ దేవ్ గణ్ రోల్ పై అవగాహన రావడం జరిగింది.
undefined
చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి సోషల్ మీడియాలో నటుడు అజయ్ దేవ్ గణ్ తో దిగిన ఫోటో పంచుకున్నారు. అదే సమయంలో అజయ్ దేవ్ గణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో తన తండ్రి పాత్ర చేస్తున్నారని తెలియజేశారు. చక్రి ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్ర చేస్తున్న నేపథ్యంలో అజయ్ దేవ్ గణ్ ఎన్టీఆర్ తండ్రి పాత్ర చేస్తున్నారని అర్థం అవుతుంది.
undefined
గతంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు అజయ్ దేవ్ గణ్ గురువుగా కనిపిస్తారని వార్తలు వచ్చాయి. కాని ఆయన ఎన్టీఆర్ తండ్రి పాత్ర చేస్తున్నారని, అది కూడా ఎన్టీఆర్ పిల్లాడిగా ఉన్నప్పటి తండ్రి పాత్ర అని తెలుస్తుంది. ఈ న్యూస్ లీక్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
undefined
మరోవైపు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైంది. షూటింగ్స్ సెట్స్ నందు ఎన్టీఆర్, చరణ్ పాల్గొంటున్నట్లు సమాచారం. ఇక ఆర్ ఆర్ ఆర్ విడుదల మరోమారు  వాయిదాపడగా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
undefined
click me!