ప్రకాష్ రాజ్ నాన్ లోకలా... అయితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ కూడా... వర్మ లాజిక్ వింటే నిజమే అనిపిస్తుంది!

First Published Jun 26, 2021, 8:10 AM IST

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్ష ఎన్నికలకు నెలల సమయం ఉంది. అయితే ఎన్నికల్లో పోటీపడనున్న అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవితా రాజశేఖర్ లతో పాటు నటి హేమ పోటీలో దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ప్రకాష్ రాజ్ ప్రచార జోరు పెంచారు. ఆయన తన ప్యానెల్ కి సంబంధించిన 27మంది సభ్యులతో కూడిన లిస్ట్ విడుదల చేశారు. సాయి కుమార్, జయసుధ, శ్రీకాంత్, అనసూయ, ప్రగతి వంటి నటులు ఈ లిస్ట్ లో ఉన్నారు.
undefined
నిన్న తన మద్దతుదారులతో ప్రకాష్ రాజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. కాన్ఫరెన్స్ లో పాల్గొన్న నాగబాబు, బండ్ల గణేష్ లాంటి వారు ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలిపారు. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటున్న ప్రత్యర్ధుల విమర్శలకు సమాధానం చెప్పారు.
undefined
ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అనే అంశం ప్రెస్ కాన్ఫరెన్స్ లో రసాభాసకు దారితీసింది. ఇది ఇలా ఉంటే వివాదం ఎక్కడవున్నా వాలిపోయే వర్మ తన ట్వీట్స్ తో విరుచుకుపడ్డారు. ప్రకాష్ రాజ్ ని నాన్ లోకల్ అంటారా.. అయితే ఎన్టీఆర్ నుండి అమితాబచ్చన్ వరకు అందరూ నాన్ లోకల్స్ అంటూ వరుస ట్వీట్స్ వేశాడు.
undefined
కర్ణాటక నించి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే, గుడివాడ నుంచి చెన్నైకి వెళ్లిన  రామారావుగారు, నాగేశ్వరరావుగారు …బుర్రిపాలెం నించి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు,తిరుపతి నుండి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు లోకలా ??? ఎలా ఎలా ఎలా.. అంటూ ట్వీట్ చేశాడు
undefined
మరో ట్వీట్ లో ... కర్ణాటక నించి  AP కి వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే, మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్ గారు, ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర కి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ గారు లోకలా ??? ఎలా ?  ఎలా ?  ఎలా ?... అని ప్రశ్నించారు.
undefined
జాతీయ అవార్డు నాలుగుసార్లు తీసుకున్న నటుడ్ని నాన్ లోకల్ అనడం ద్వారా మీరు దేశాన్ని అవమానిస్తున్నారని, తెలుగు పరిశ్రమలో 30ఏళ్లుగా ఉంటూ, ఇక్కడ నివాసం ఏర్పరుచుకొని ఎందరికో సహాయం చేస్తున్న ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ ఎలా అవుతారని అడిగారు.
undefined
ఇక మీరు అభిమానించే హీరోయిన్స్, మైఖేల్ జాక్సన్, బ్రూస్ లీ, చివరకు రాముడు, సీత నాన్ లోకల్స్, అలాగే ప్రకాష్ రాజ్ కూడా నాన్ లోకల్ అంటూ తనదైన శైలిలో సెటైర్స్ వేశాడు వర్మ.  ప్రస్తుతం వర్మ ట్వీట్స్ వైరల్ గా మారాయి.
undefined
click me!