ఎన్టీఆర్‌ని వెంటాడుతున్న మరో బ్యాడ్‌ సెంటిమెంట్‌?, `దేవర` చుట్టూ ఇంత నెగటివిటీ ఏంటి?

First Published | Sep 23, 2024, 6:10 PM IST

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన `దేవర` సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు మరో బ్యాడ్‌ సెంటిమెంట్‌తో ఆడుకుంటున్నారు నెటిజన్లు. 
 

ఎన్టీఆర్‌ నటించిన `దేవర` సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కాన్సిల్‌ అయిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరగాల్సిన ఈ ఈవెంట్‌, అభిమానుల భారీ తాకిడి కారణంగా రద్దు చేశారు. నోవాటెల్‌ కెపాసిటీ మూడు వేలు, కానీ సుమారు పది వేల మంది అభిమానులు అక్కడికి వచ్చినట్టు సమాచారం. ఫ్యాన్స్ ని కంట్రోల్‌ చేయడం సిబ్బంది తరం కాలేదు. నోవాటెల్‌ లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహించిన ఫ్యాన్స్ హోటల్‌ అద్దాలు ధ్వంసం, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. దీంతో పెద్ద రచ్చ రచ్చ అయ్యింది. 
 

ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్‌ సోలో హీరోగా చేసిన సినిమా కావడం, పైగా పాన్‌ ఇండియా మూవీ కావడంతో తారక్‌ ఫ్యాన్స్ ఆయన్ని కలిసేందుకు భారీగా తరలి వచ్చారు. కానీ ఇక్కడ లిమిటేషన్స్ పెట్టడంతో వాళ్లంతా సహనం కోల్పోయారు. నిర్వాహకుల వైఫల్యం కారణంగా అభిమానులు డిజప్పాయింట్‌ కావాల్సి వచ్చింది.

అటు `దేవర` టీమ్‌ సైతం ఇబ్బంది పడ్డాల్సి వచ్చింది. దీనికితోడు పరిమితి మించి పాస్‌లు అమ్మడం కూడా దీనికి కారణమని తెలుస్తుంది. దీనిపై స్పందించిన ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి సారీ చెబుతూ, వీడియో విడుదల చేశారు. తానే ఎక్కువగా బాధపడతానని తెలిపారు. ఈ నెల 27న థియేటర్లలో కలుద్దామని చెప్పారు. 
 

Latest Videos


ఈ లెక్కన ఇక `దేవర` సినిమాకి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు. ఇది మరింత నిరాశ పరిచే వార్తగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే దీనితోడు ఎన్టీఆర్‌ని మరిన్ని బ్యాడ్‌ సెంటిమెంట్లు వెంటాడుతున్నాయి. అవన్నీ `దేవర`పై ప్రభావాన్ని చూపేలా ఉన్నాయి. మరి అవేంటనేది చూస్తే, రాజమౌళితో సినిమా తర్వాత చేసే ఏ మూవీ అయిన పరాజయం చెందుతుందనే టాక్‌ ఉంది.

ఓ సందర్భంలో తారక్‌ కూడా చెప్పాడు. గతంలోనూ అదే జరిగింది. దీంతో `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత ఎన్టీఆర్‌ చేసిన సినిమా కావడంతో దీనికి కూడా ఆ సెంటిమెంట్‌ పనిచేస్తుందేమో అని, సినిమా కూడా ఫ్లాప్‌ తప్పదనే టాక్‌ వస్తుంది. ఇది సినిమాపై అంచనాలు తగ్గిస్తుంటే, ఇలాంటి సంఘటనలు సైతం మరింత నెగటివ్‌గా మార్చేస్తున్నాయి. 

andhrawala

దీనికితోడు మరో సెంటిమెంట్‌ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు ఆడలేదు. `ఆంధ్రావాలా`, `శక్తి` చిత్రాలు ఆడలేదు. `అదుర్స్` ఒక్కటే హిట్‌ అయ్యింది. అయితే తండ్రీ కొడుకులుగా చేసిన సినిమాలు ఆడలేదు. `ఆంధ్రావాలా`, `శక్తి`లో అలానే కనిపిస్తాడు.

ఇప్పుడు `దేవర`లోనూ తండ్రీ కొడుకులుగానే కనిపిస్తున్నారు ఎన్టీఆర్‌.  తండ్రి దేవర, కొడుకు వర గా కనిపించబోతున్నారు. దీంతో ఆ సినిమాలు పరాజయం చెందిన నేపథ్యంలో ఆ సెంటిమెంట్‌ ప్రకారం ఈ మూవీ కూడా ఆడటం కష్టమే అంటున్నారు నెటిజన్లు. 

ఇదే ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ని భయపెడుతుంటే, ఇప్పుడు కొత్తగా మరో సెంటిమెంట్‌ పుట్టుకొచ్చింది. `దేవర` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని రద్దు చేయడమే ఆ సెంటిమెంట్‌. `ఆంధ్రావాలా` సినిమా టైమ్‌లోనూ ఈవెంట్ని అర్థంతరంగా ముగించాల్సి వచ్చింది. అప్పుడు నిమ్మకూరులో ఆడియో ఈవెంట్‌ పెట్టారు.

హెలికాప్టర్‌లో వెళ్లాడు తారక్‌. ఈ ఈవెంట్‌కి పది లక్షల మందికిపైగా తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి ఆరు రైళ్లలో ఫ్యాన్స్ అక్కడికి వచ్చారట. దీంతో ఆ ఏరియా మొత్తం కిక్కిరిసిపోయింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యిందట. స్టేడియం కెపాసిటీ 20వేలు, కానీ వచ్చింది పది లక్షల మంది. స్టేడియం సరిపోలేదు, సమీపంలో రెండు మూడు కిలోమీటర్లు జామ్‌ అయిపోయింది.

స్టేజ్‌పైకి కూడా అభిమానులు వచ్చి రచ్చ చేశారు. దీంతో ఎన్టీఆర్‌ రెండు ముక్కలు మాట్లాడి, ఈవెంట్‌ని ముగించారు. కేవలం అరగంటలోనే ఈవెంట్‌ అయిపోయింది. ఒక హీరో కోసం ఇంత మంది జనం రావడం అదే ఫస్ట్. అది పెద్ద సంచలనంగా మారింది. కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్‌ అయ్యింది. 
 

మళ్లీ ఎన్టీఆర్‌ నటించిన `దేవర` ఈవెంట్‌ రద్దు అయ్యింది. ఇప్పుడు కూడా పరిమితి మించిన ఫ్యాన్స్ రావడంతో ఈవెంట్‌ని రద్దు చేశారు. అందులోనూ ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం, ఇందులోనూ సేమ్‌, దీంతో ఈ సెంటిమెంట్‌ కారణంగా `దేవర` కూడా డిజప్పాయింట్‌ చేస్తుందా? అనే చర్చ మొదలైంది. సోషల్‌ మీడియాలో ఇది హాట్‌ టాపిక్‌ అవుతుంది.

ఇప్పటికే విడుదలైన `దేవర` టీజర్‌, ట్రైలర్లు కూడా నిరాశ పరిచేలా ఉన్నాయి. పైగా ఇది రెండు పార్ట్ లు. మొదటి దాంట్లో కథేం లేదని అర్థమవుతుంది. ఇవన్నీ సినిమాకి నెగటివ్‌గా మారుతున్నాయి. మరి వీటిని దాటుకుని ఎన్టీఆర్‌ సక్సెస్‌ కొడతాడా? అన్ని బ్యాడ్‌ సెంటిమెంట్లని బ్రేక్‌ చేస్తాడా? `దేవర` సక్సెస్‌ అవుతుందా? అనేది చూడాలి.

వీటన్నింటిని ఓవర్ కమ్‌ చేసి సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుందాం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. సెప్టెంబర్‌ 27న సినిమా విడుదల కానుంది. 

click me!