పాన్ ఇండియా డైరెక్టర్, టాలీవుడ్ హీరో చేసిన సాయం..వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం కమెడియన్ ఏం చేశాడో తెలుసా

చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు తాము చేసిన, చేస్తున్న సహాయాలు, చారిటి కార్యక్రమాల గురించి బయట చెప్పుకోరు. కొన్ని విషయాలు మాత్రం సాయం పొందిన వాళ్ళ ద్వారా వెలుగులోకి వస్తుంటారు.

Comedian dhanraj interesting comments on tollywood director and Hero dtr

చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు తాము చేసిన, చేస్తున్న సహాయాలు, చారిటి కార్యక్రమాల గురించి బయట చెప్పుకోరు. కొన్ని విషయాలు మాత్రం సాయం పొందిన వాళ్ళ ద్వారా వెలుగులోకి వస్తుంటారు. అలాంటి ఆసక్తికర సంఘటనని ఓ టాలీవుడ్ కమెడియన్ రివీల్ చేశారు. జబర్దస్త్ షోతో పాపులర్ అయిన కమెడియన్స్ లో ధనరాజ్ కూడా ఒకరు. 

Comedian dhanraj interesting comments on tollywood director and Hero dtr

ధనరాజ్ జబర్దస్త్ షోలో రాణించి ఆ తర్వాత అనేక చిత్రాల్లో కమెడియన్ గా నటించారు. పిల్ల జమిందార్, భీమిలి కబడ్డీ జట్టు లాంటి చిత్రాల్లో ధనరాజ్ కామెడీ హైలైట్ అయింది. ఇవి మాత్రమే కాకుండా చాలా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. ఒక దశలో ధనరాజ్ తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడట. ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో తెలిపారు. 


ఆ టైంలో తనని అందుకున్న వాళ్ళ గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధనరాజ్ మాట్లాడుతూ పెళ్లి తర్వాత నాకు ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. ఫ్యామిలీని పోషించడం కోసం ఎవరినైనా సాయం అడగలనుకున్నా. వెళ్లి హీరో రామ్ గారిని అడిగా. ఆయన వెంటనే 10 వేల రూపాయల చెక్ రాసి ఇచ్చారు. అది జగడం షూటింగ్ జరుగుతున్న సమయంలో. ఆ టైంలో 10 వేలు అంటే నాకు 10 లక్షలతో సమానం. 

అప్పుడు రామ్ గారు నాతో ఒక మాట అన్నారు. 10 వేలు మాత్రమే కాదు.. నీకు ఎలాంటి సాయం కావాలన్నా సిగ్గులేకుండా నన్ను అడిగి అని చెప్పారు. నన్ను ఆదుకున్న మరో వ్యక్తి డైరెక్టర్ సుకుమార్ గారు అని ధనరాజ్ తెలిపారు. ఒకసారి ప్రసాద్ లాబ్స్ లో ఆయన్ని కలిశాను. నేను ఇబ్బందుల్లో ఉన్నానని ఆయనకి తెలుసు. వెంటనే తన జేబులో ఎంత డబ్బు ఉందో కూడా లెక్కపెట్టకుండా ఇచ్చేశారు. 

ఈ డబ్బుతో ఇంట్లో అందరికీ మంచి బట్టలు అవసరమైనవి కొనుక్కుని వెళ్ళు అని చెప్పారు. సరిపోతాయా ఇంకా ఇవ్వనా అని అడిగారు. నాపై చూపించిన ప్రేమకు ఆశ్చర్యపోయాను. వాళ్ళు నాపై కేర్ చూపించాల్సిన అవసరం కూడా లేదు.. ఎందుకంటే నేను పెద్ద స్టార్ అని కూడా కాదు. అయినా నన్ను ఆదుకున్నారు. 

ఎలాగైనా సుకుమార్, రామ్ ఇద్దరి రుణం తీర్చుకోవాలనుకున్నా. ఆ టైంలో నాకు కొడుకు పుట్టాడు. 21 రోజుల తర్వాత బాబుకి నామకరణం చేయాలి. అప్పడే నేను డిసైడ్ అయ్యాను. నా కొడుక్కి సుఖ్ రామ్ అని పేరు పెట్టాను. సుకుమార్, రామ్ ఇద్దరి పేర్లు కలసి వచ్చేలా తన కొడుక్కి నామకరణం చేసినట్లు ధన్ రాజ్ తెలిపారు. 

Latest Videos

click me!