అగ్రెసివ్ గా ఉన్నప్పటికీ జన్యూన్ గేమ్ ఆడే కంటెస్టెంట్స్ పట్ల పాజిటివ్ గా స్పందిస్తారు. గతంలో తేజస్వి మాడివాడ, శ్రీసత్య, శోభా శెట్టి, రతిక రోజ్ వంటి కంటెస్టెంట్స్ ప్రేక్షకుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఈ సీజన్ కి సోనియా ఆకుల సోషల్ మీడియాలో నెగిటివిటీ ఫేస్ చేస్తుంది.
ఈమె చర్యలు విభిన్నంగా ఉంటాయి. పృథ్విరాజ్, నిఖిల్ తో సన్నిహితంగా ఉంటుంది. ఒకరిని చిన్నోడా మరొకరిని పెద్దోడా అంటుంది. వాళ్లతో ఆమె ప్రవర్తించే తీరు ఒకింత ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పాలంటే ఒక ప్రేమికురాలిని తలపించేలా ఆమె బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ క్రమంలో సోనియా... బిగ్ బాస్ హౌస్లో ప్రేమదేశం మూవీ స్టోరీ రన్ చేస్తుందనే వాదన మొదలైంది.