చిత్రం భళారే విచిత్రం అన్నట్లు... చిత్ర పరిశ్రమలో విచిత్రాలు చోటు చేసుకుంటాయి. స్టార్ హీరోలు ఎవర్ గ్రీన్ గా అలానే ఉంటారు. వారితో నటించిన హీరోయిన్స్ జెనరేషన్స్ తో పాటు ఫేడ్ అవుట్ అవుతారు. ఎన్టీఆర్ మనవరాలిగా నటించిన శ్రీదేవి పెద్దయ్యాక ఆయన పక్కనే హీరోయిన్ గా చేసింది.
28
ఇక అంజలీ దేవి చాలా చిత్రాల్లో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా చేసింది. ఆమె ఫేడ్ అవుట్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. అప్పుడు ఎన్టీఆర్ కి తల్లిగా నటించారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే మహేష్ బాబుకు ఎదురైంది. ఒకప్పుడు రొమాన్స్ చేసిన హీరోయిన్ ఆయనకు తల్లిగా మారింది.
38
Mahesh Babu
గుంటూరు కారం మూవీలో రమ్యకృష్ణ కీలక రోల్ చేస్తున్నారు. ఆమె మహేష్ తల్లిగా కనిపించనున్నారు. గుంటూరు కారం మూవీలో హీరో మహేష్ తల్లి రమ్యకృష్ణ తిరస్కరణకు గురవుతాడు. ఓ కారణంగా ఆమె కన్న కొడుకును దూరం పెడుతుంది. తల్లి ప్రేమకు నోచుకోని కొడుకుగా మహేష్ బాబు పాత్ర ఉండనుంది.
48
Guntur Kaaram
గుంటూరు కారంలో రమ్యకృష్ణ-మహేష్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు హైలెట్ గా నిలవనున్నాయట. త్రివిక్రమ్ వీరిద్దరి మధ్య సంభాషణలు, సంఘర్షణ అద్బుతంగా తెరకెక్కించాడని సమాచారం. మదర్ సెంటిమెంట్ తో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం.
58
Mahesh Babu
అయితే మహేష్ కి తల్లిగా నటించిన రమ్యకృష్ణ గతంలో ఆయనతో రొమాన్స్ చేసింది. ఎస్ జే సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన నాని చిత్రం 2004లో విడుదలైంది. ఈ మూవీలో అమీషా పటేల్ హీరోయిన్. దేవయాని, రఘువరన్ కీలక రోల్స్ చేశారు.
68
Mahesh Babu
నాని మూవీలో రమ్యకృష్ణ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు. మహేష్ -రమ్య కృష్ణ పై 'మార్కండేయ' అనే ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉంటుంది. నాని మూవీ వచ్చి రెండు దశాబ్దాలు కావస్తుంది. దీంతో ఈ విషయం అందరూ మర్చిపోయారు.
78
Mahesh Babu
తాజాగా గుంటూరు కారం మూవీలో రమ్యకృష్ణ హీరో మహేష్ తల్లి పాత్ర చేస్తున్నారని తెలిసి కొందరు ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ తెరపైకి తెచ్చారు. దీంతో అయ్యో మహేష్ బాబు తల్లి పాత్ర చేసిన నటితో రొమాన్స్ చేయాల్సి వస్తుందని అసలు ఊహించి ఉండడు, అని కామెంట్ చేస్తున్నారు.
88
గుంటూరు కారం మూవీ జనవరి 12న విడుదల కానుంది. మహేష్ కి జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకుడు. థమన్ సంగీతం అందిస్తుండగా, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.