ప్రస్తుతం మల్లిక బాలీవుడ్ కి దూరంగా ఉంటుంది. 2017లో విడుదలైన జీనత్ మూవీ తరువాత మల్లికా శెరావత్ వెండితెరపై కనిపించలేదు.2019లో ఓ వెబ్ సిరీస్ చేయడం జరిగింది. కొన్నాళ్లుగా ఆమె ఫ్రాన్స్ కి చెందిన సిరిల్ ఆగ్జిన్ఫెన్స్ అనే బిజినెస్ మాన్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
2017లో మల్లికా మరియు ఆమె బాయ్ ఫ్రెండ్ సిరిల్ వారు నివసిస్తున్న అపార్ట్మెంట్ నుండి గెంటి వేయబడ్డారట. అపార్ట్మెంట్ అద్దె చెల్లించని కారణంగా ఓనర్ వీరిద్దరిని బయటికి నెట్టివేశాడట.
వారు నివసిస్తున్న అపార్ట్మెంట్ యజమానికి 80వేల యూరోలు బాకీ పడ్డారట. ఇండియన్ కరెన్సీలో 64లక్షల వరకు వీరు బకాయి పడడంతో పాటు ఆ మొత్తంచెల్లించలేక పోయారట. దీనితో యజమాని వీరితో ఇంటిని ఖాళీ చేయించారట.
ఇక సినిమాలోకి రాకముందే మల్లికకు ఢిల్లీకి చెందిన పైలట్ కరణ్ సింగ్ గిల్ తో 1997లో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నాడనే ప్రచారం కూడా జరిగింది. మల్లికా కెరీర్ ఎయిర్ హోస్ట్ స్గా మొదలుపెట్టారు.
హీరోయిన్ కావాలని కోరుకున్న మల్లికా శెరావత్ హర్యానా వదిలి ముంబైకి వచ్చి సెటిల్ అయ్యారు.
2002లో వచ్చిన జీనా హై సిర్ఫ్ మేరేలియే చిత్రంతో వెండితెరకు పరిచయమైన మల్లిక, కెరీర్ బిగినింగ్ లోనే బోల్డ్ రోల్స్ చేసింది. 2003లో వచ్చిన క్వాహిష్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న మల్లికా ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
ఆ మూవీలో మల్లికాతన కో స్టార్ హిమాన్షు మాలిక్తో 17 ముద్దు సన్నివేశాలలోనటించింది. ఆ సినిమా తరువాత మహేష్ భట్ క్యాంపులోకి ఎంటరైన మల్లికా మర్డర్ మూవీలో మరో బోల్డ్ రోల్ చేయడం జరిగింది. హిమేష్ రేష్మియాతో కలిసి అనేక బోల్డ్ సన్నివేశాలలోమల్లికా నటించారు.
కిస్ కిస్ కిస్ కిస్మత్, మర్డర్, ప్యార్ కి సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాలుమల్లికకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2019లో వచ్చిన ఓ వెబ్ సిరీస్ లో కూడా మల్లికానటించడం జరిగింది.