Kaikala Satyanarayana:కైకాలకు రేపుల నారాయణ అనే పేరు ఎందుకు వచ్చింది?

Published : Nov 20, 2021, 10:52 PM ISTUpdated : Nov 20, 2021, 11:01 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో కైకాల సత్యనారాయణది సుదీర్ఘ ప్రస్థానం. ఆరు దశాబ్దాల నటనా జీవితంలో వందల చిత్రాలలో విభిన్న పాత్రలు చేశారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాలలో అనేక జోనర్స్ లో కైకాల నటించారు.   

PREV
15
Kaikala Satyanarayana:కైకాలకు రేపుల నారాయణ అనే పేరు ఎందుకు వచ్చింది?

కైకాల కెరీర్ లో అత్యధికంగా చేసింది మాత్రం విలన్ రోల్స్ ఏడాదికి పదికి పైగా చిత్రాలు చేసేవారు కైకాల. వీటిలో దాదాపు ఆయన విలన్ గా చేసిన సినిమాలే ఎక్కువ. ఎన్టీఆర్, ఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ వంటి మొదటితరం స్టార్స్ చిత్రాలతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ చిత్రాలలో కూడా ఆయన విలన్ పాత్రలు చేశారు. 

25


ఇక 60-70లలో ఎక్కువగా ఆయన కరుడుగట్టిన విలన్ రోల్స్ చేశారు. యంగ్ ఏజ్ లో ఉన్న కైకాల సత్యనారాయణకు (Kaikala Satyanarayana) అమ్మాయిలను మోసం చేయడం, మానభంగాలు పాల్పడడం, హింసించడం వంటి రోల్స్ దక్కేవి. సదరు పాత్రలలో భీభత్సమైన విలనిజం పండిచేవాడు కైకాల. దీనితో సొసైటీలో ఆయనకు పూర్తి నెగిటివ్ ఇమేజ్ ఉండేది. 

35

ముఖ్యంగా ఆడవాళ్లు కైకాల సత్యనారాయణ అంటే మండిపడేవారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కైకాలపై ఆడవాళ్లు మాటల దాడి చేశారట. ఆ సత్తిగాడిని వెనుక నుండి పొడిచేయాలని ఒకరు కామెంట్ చేస్తే, మరో మహిళ.. ఎందుకయ్యా ఆడవాళ్ళ జీవితాలతో అలా ఆడుకుంటావ్.. అని నిలదీసిందట. ఓ ఇంటర్వ్యూలో కైకాల ఈ విషయాలు చెప్పి, నవ్వుకున్నారు. 

45

కైకాలను ఆ రోజుల్లో కొందరు రేపుల నారాయణ అని కూడా పిలిచేవారట. అప్పట్లో తెరపై జరిగేది నిజంగా భావించే అమాయకత్వం ప్రేక్షకులలో ఉండేది. హీరో హీరోయిన్స్ పై ఎనలేని అభిమానం , విలన్ రోల్స్ చేసే నటులపై కోపం పెంచుకునేవారు. పేక్షకులను అంతలా కోపానికి గురి చేసేంత సహజ నటన కైకాల కనబరిచేవారు.

55

 
90ల తర్వాత కైకాల విలన్ రోల్స్ తగ్గించేశారు. ఆయనకు వయసు మీద పడడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు. హీరో హీరోయిన్ తండ్రి, తాత పాత్రలు చేస్తూ వచ్చారు. కామెడీ, ఎమోషన్స్ ప్రధానంగా ఆయన పాత్రలు సాగాయి. 2019లో విడుదలైన ఎన్టీఆర్ కథనాయకుడు, మహర్షి చిత్రాలలో ఆయన చివరిగా కనిపించారు. 

Also read Kaikala Satyanarayaana: కైకాల సత్యనారాయణ ఆరోగ్యపరిస్థితిపై హెల్త్ బులెటిన్... కాపాడడం చాలా కష్టం!

Also read Kaikala Satyanarayana: వెండితెర యముడు... ఆ పాత్రలో తిరుగులేని రారాజు!

click me!

Recommended Stories