‘దానవీర శూర కర్ణ’ టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఒకటిగా నిలవగా, ‘కురుక్షేత్రం’ సినిమాను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. అనుకున్న బడ్జెట్ దాటిపోవడంతో నిర్మాత అంజనేయులు, ‘కురుక్షేత్రం’ సినిమాను మధ్యలోనే నిలిపివేయాలని భావించారు. అయితే సినిమాను పరువు సమస్యగా తీసుకున్న కృష్ణ, నిర్మాతగా మారి, ‘కురుక్షేత్రం’ మూవీని పూర్తి చేయించారు.