ఆస్కార్ పంచాయతీ... మరోసారి రెచ్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్..!

First Published Sep 16, 2022, 5:05 PM IST

ఇద్దరు స్టార్ హీరోలని పెట్టి భారీ బడ్జెట్ లో సినిమా తీయడం అంత సులువైన పని కాదు.చిన్న తేడా జరిగినా మొదట టార్గెట్ అయ్యేది దర్శకుడే. కానీ జక్కన్న రాజమౌళి విజయవంతంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కంప్లీట్ చేసి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చేశాడు. 

ఇద్దరు స్టార్ హీరోలని పెట్టి భారీ బడ్జెట్ లో సినిమా తీయడం అంత సులువైన పని కాదు. ముఖ్యంగా టాలీవుడ్ లో.. ఎందుకంటే అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్స్ ఎలా జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. చిన్న తేడా జరిగినా మొదట టార్గెట్ అయ్యేది దర్శకుడే. కానీ జక్కన్న రాజమౌళి విజయవంతంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కంప్లీట్ చేసి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చేశాడు. 

కానీ ఫ్యాన్స్ మధ్య గొడవలు మాత్రం ఆపడం రాజమౌళి వల్ల కూడా కావడం లేదు. సినిమా ఎంత పెద్ద విజయం సాధించినప్పటికీ ఈ చిత్రంలో మా హీరోనే బాగా నటించాడు అని చరణ్ ఫ్యాన్స్ అంటుంటే.. లేదు మా ఎన్టీఆరే గొప్ప అని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు. ఇలా సినిమా రిలీజైనప్పటి నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ విషయంలో నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. 

కొన్ని రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి ఆస్కార్ బరిలో ఎన్టీఆర్ నిలిచే అవకాశం ఉంది అంటూ అమెరికాకి చెందిన ప్రతిష్టాత్మకమైన 'వెరైటీ' మ్యాగజైన్ పేర్కొంది. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ ఒక రేంజ్ లో రచ్చ చేశారు. దీనిపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇందంతా పైడ్ ప్రమోషన్ లో భాగమే అని విమర్శించారు. డబ్బులిచ్చి మ్యాగజైన్ లో పేరు వేయించుకున్నారు అంటూ మెగా ఫ్యాన్స్ ఆరోపించారు. 

తాజాగా వెరైటీ మ్యాగజైన్ ఆస్కార్ బరిలో నిలిచే నటుల జాబితాలో రాంచరణ్ పేరుని కూడా చేర్చింది. దీనితో చరణ్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. రాంచరణ్ ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాని మోతెక్కిస్తున్నారు. దీనితో ఎన్టీఆర్ అభిమానులు కౌంటర్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఇప్పుడు మీ హీరో కూడా డబ్బులిచ్చి పేరు వేయించుకున్నాడా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

ఈ లిస్ట్ లో 35వ స్థానంలో ఎన్టీఆర్ ఉండగా.. 36వ స్థానంలో రాంచరణ్ పేరు ఉంది. చూస్తుంటే ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానుల మధ్య ఈ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఏది ఏమైనా అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి, తెలుగు నటుల గురించి చర్చ జరుగుతుండడం టాలీవుడ్ కి గర్వకారణం అని చెప్పొచ్చు. 

కొమరం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ ఇద్దరూ సాలిడ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. కొమరం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం ప్రదర్శించాడు. రాంచరణ్ కూడా ఎక్కడా తగ్గలేదు. లోలోపల సంఘర్షణకు గురవుతున్న బ్రిటిష్ పోలీస్ గా చరణ్ నటన అదుర్స్ అనే చెప్పాలి. 

యాక్షన్ ఎపిసోడ్స్ లో ఇద్దరూ చెలరేగిపోయారు. ఓవరాల్ గా ఎన్టీఆర్ కి కాస్త ప్రాధాన్యత తగ్గింది అని నందమూరి ఫ్యాన్స్ నిరాశకు గురైన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం వీరిద్దరి గురించి ఆస్కార్స్ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ చిత్రం విజయం సాధిస్తుందా లేదా అనేది పక్కన పెడితే.. నామినేట్ అయినా చాలు.. అది పెద్ద విజయమే అని చెప్పొచ్చు. 

click me!