Brahmastra Collections : ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ వీక్ సాలిడ్ కలెక్షన్స్.. ఎంత వసూల్ చేసిందంటే?

First Published Sep 16, 2022, 4:45 PM IST

బాలీవుడ్ లో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న ఫాంటసీ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ సాలిడ్ మార్క్ ను రీచ్ అయ్యాయి. 
 

బాలీవుడ్ స్టార్ హీరో ర‌న్బీర్‌ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన ఫాంటసీ ఫిల్మ్  'బ్రహ్మాస్త్ర'. చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన  విషయం తెలిసిందే. సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తొలిరోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈచిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
 

తొలిరోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 70 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. రెండో రోజు రూ.160 కోట్లు సాధించగా.. మూడు రోజుల్లో రూ.200 కోట్లు సాధించినట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. తాజాగా ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ భారీ చిత్రం సాలిడ్ మార్క్ ను రీచ్ అయ్యింది. 

లేటెస్ట్ గా చిత్ర యూనిట్ మొదటి వారం కలెక్షన్స్ ను అధికారికంగా ప్రకటించింది. వారం రోజుల్లో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం  రూ. 300 కోట్లను కలెక్ట్ చేసింది. ఫస్ట్ వీక్ ఇండియాలో రూ.200 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. ఓవర్సీస్ లో రూ.100 కోట్లను రాబట్టింది. మొత్తంగా రూ.300 కోట్లు వసూల్ చేసి కలెక్షన్స్ లో జోరు చూపిస్తోంది.
 

మొదటి రోజు 'బ్రహ్మాస్త్ర' (Brahmāstra Part One: Shiva)కు మిశ్రమ స్పందన వచ్చిన వసూళ్లలో మాత్రం అదుర్స్ అనిపించింది. ఇప్పటి వరకు అదే జోరును కనబరుస్తోంది. తెలుగులోనూ ఈ పాన్ ఇండియా ఫిల్మ్ వసూళ్లు చేస్తుండటం విశేషం. ప్రస్తుతం భారీ చిత్రాలు రిలీజ్ లో లేకపోవడం సినిమాకు ప్లస్ గా మారింది.  
 

ఇప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో వస్తున్నారు. సినిమా విడుదలకు ముందు హీరో హీరోయిన్లు ర‌ణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్ దేశంలో వివిధ నగరాల్లో చేసిన ప్రచారంతో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేయడం, భారీ విజువల్స్, బిగ్ స్టార్స్ పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ వెండితెరపైనే వీక్షించేందుకు మొగ్గుచూపుతున్నారు. 
 

తెలుగులో ఈ చిత్రం ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో రిలీజ్ అయ్యింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మూవీని సమర్పించడం విశేషం. ప్రచార కార్యక్రమాల్లోనూ జోరుగా తిరుగుతూ సినిమాకు అండగా నిలిచారు. మూవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్, షారూఖ్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. 

click me!