పురాణాలకు, సైన్స్ ని ముడిపెట్టి దర్శకుడు ఈ మూవీ తెరకెక్కిస్తున్నారట. కల్కి అవతారాలు చూపించబోతున్నారట. ఇవన్నీ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. మరోవైపు ప్రభాస్‌తోపాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ వంటి వాళ్లు నటిస్తున్నారు. వీరితోపాటు రానా, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, అలాగే ఆర్జీవీ, రాజమౌళి కూడా ఇందులో గెస్ట్ రోల్స్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ సినిమాపై హైప్‌ని అమాంతం పెంచేస్తున్నాయి.