రష్మీ గౌతమ్ పై సోషల్ మీడియా నెగిటివిటీ తక్కువేం కాదు. పలు విషయాల్లో ఆమె విమర్శలకు గురయ్యారు. అయోధ్య లో రామ మందిర్ నిర్మాణాన్ని సమర్థిస్తూ రష్మీ సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టింది. ఈ విషయంలో కూడా ఆమె వ్యతిరేకతకు గురైంది. నేడు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. దీంతో ట్రోలర్స్ కి రష్మీ గౌతమ్ కౌంటర్ ఇచ్చింది.
rashmi Instagram
రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. ఆమెకు హింస నచ్చదు. ఏ రూపంలో కూడా జంతువులు హింసకు గురి కాకూడదని రష్మీ వేగన్ గా మారింది. ఆమె గుడ్లు, పాలు, పాలతో తయారు చేసే ఆహారపదార్ధాలు కూడా తినదు.
photo credit - rashmi instagram
బక్రీద్ పండగనాడు ముస్లింలు సాంప్రదాయంలో భాగంగా చేసే జంతు బలులను ఆమె సోషల్ మీడియా వేదికగా ఖండించారు. దీంతో ఆమెను ట్రోల్ చేశారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో ఆమెకు పెద్ద డిబేట్ పెట్టింది. కామెంట్స్ కి కౌంటర్లు ఇచ్చింది.
అదే సమయంలో రష్మీ గౌతమ్ ఆడియోధ్యలో రామ మందిర్ నిర్మాణానికి మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టింది. దాంతో ఆమె ముస్లిం వ్యతిరేకి అన్న భావన కొందరిలో కలిగింది. ఈ క్రమంలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్స్ పై స్పందిస్తూ రష్మీ గౌతమ్ కౌంటర్ ఇచ్చింది.
ట్రోలర్స్ కి సమాధానం చెప్పే సమయం నా దగ్గర లేదు. నేను కాషాయ రంగు చీర సిద్ధం చేసుకున్నాను. దీపాలు వెలిగించాలి. ఇకపై ఏడాదికి రెండు దీపావళులు. రాముడు, సీత తిరిగి ఇంటికి వచ్చేశారు. జై శ్రీరామ్ అంటూ ట్వీట్ చేసింది.
Rashmi Gautam
రష్మీ గౌతమ్ ట్వీట్ ఒక వర్గాన్ని మరింత రెచ్చగొట్టేదిగా ఉంది. రష్మీ గౌతమ్ యాంకర్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. ఆమె ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో యాంకర్ గా వ్యవహరిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.