Oke Oka Jeevitham Review: ఒకే ఒక జీవితం ప్రీమియర్ టాక్... శర్వానంద్ ప్రయోగాత్మక చిత్రం హిట్టా? ఫట్టా?

Published : Sep 09, 2022, 01:17 AM ISTUpdated : Sep 09, 2022, 01:58 AM IST

శర్వానంద్ లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం. టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో ప్రయోగాత్మకంగా తెరకెక్కింది. డెబ్యూ డైరెక్టర్ శ్రీ కార్తీక్ తెరకెక్కించిన ఒకే ఒక జీవితం ప్రీమియర్స్ ప్రదర్శన ముగియగా టాక్ ఎలా ఉందో చూద్దాం...   

PREV
16
Oke Oka Jeevitham Review: ఒకే ఒక జీవితం ప్రీమియర్ టాక్... శర్వానంద్ ప్రయోగాత్మక చిత్రం హిట్టా? ఫట్టా?
Oke Oka Jeevitham Premier show talk

కథ 
అమ్మ ప్రేమకు దూరమైన శర్వానంద్ ఎప్పుడో చనిపోయిన తన తల్లిని కలవాలి అనుకుంటాడు. శర్వానంద్ తో పాటు తన ఇద్దరు మిత్రులు గతంలోకి వెళ్లాలని డిసైడ్ అవుతారు. సైంటిస్ట్ నాజర్ తయారు చేసిన టైం మెషిన్ లో శర్వా, వెన్నెలకు కిషోర్, ప్రియదర్శి గతంలోకి వెళతారు. 1998లోకి వెళ్లిన ఈ ముగ్గురు అప్పటి వయసుకు మారిపోతారు. కోరుకున్నట్లు శర్వా తల్లి అమలను కలుస్తాడు. అయితే అక్కడే అసలు సమస్య ఏర్పడుతుంది. వాళ్ళు తిరిగి ప్రజెంట్ లోకి రావడానికి సమస్యలు ఏర్పడతాయి... చిన్న పిల్లలుగా మారిపోయిన ఈ ముగ్గురు మిత్రులు పెద్దవాళ్లుగా ప్రజెంట్ 2019లోకి ఎలా వచ్చారనేది మిగతా కథ... 

26
Oke Oka Jeevitham Premier show talk

ఇలాంటి సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు బలమైన స్క్రీన్ ప్లే చాలా అవసరం. ఆ విషయంలో దర్శకుడు శ్రీ కార్తీక్ సక్సెస్ అయ్యాడు. ఓ ఫిక్షనల్ స్టోరీని దర్శకుడు సమపాళ్లలో రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసి ఆకట్టుకునేలా తెరకెక్కించాడు.

36
Oke Oka Jeevitham Premier show talk

ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్, సన్నివేశాలు గొప్పగా ఉన్నాయనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వెల్లడిస్తున్నారు. అలాగే ఒకే ఒక జీవితం సినిమాకు ఆయనిచ్చిన ఎమోషనల్ క్లైమాక్స్ మంచి అనుభూతిని పంచుతుంది అంటున్నారు. సెకండ్ హాఫ్ లో కథనం కొంచెం నెమ్మదించినా మొత్తంగా సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.

46
Oke Oka Jeevitham Premier show talk

సరైన విజయం లేక అల్లాడుతున్న శర్వానంద్ కి ఒకే ఒక జీవితం మూవీ హిట్ అందించినట్లే. మెజారిటీ ప్రేక్షకులు సినిమా పట్ల పాజిటివ్ ఒపీనియన్ వ్యక్తపరుస్తున్నారు. సాంకేతికంగా, కథ పరంగా సినిమా ఆకట్టుకుంది అంటున్నారు. సినిమాటోగ్రఫీ, విజువల్స్ అబ్బురపరిస్తాయి. ముఖ్యంగా జేక్స్ బిజాయ్ బీజీఎమ్ సినిమాకు హైలెట్ అన్న మాట వినిపిస్తుంది. ఎడిటింగ్ మాత్రం కొంచెం నిరాశపరిచే అంశం.

56

హీరో శర్వా నంద్ తో పాటు వెన్నెల కిషోర్, ప్రియదర్శి అద్భుతమైన నటన కనబరిచారు. అమల, నాజర్ నటన గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. హీరోయిన్ రీతూ వర్మ తన పాత్ర పరిధిలో మెప్పించే ప్రయత్నం చేశారు. మూవీలో కామెడీ, ఎమోషన్స్, రొమాన్స్, సస్పెన్సు సమపాళ్లలో చక్కగా మిక్స్ చేశారు.

66

మొత్తంగా ఒకే ఒక జీవితం కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయదగిన టైం ట్రావెలింగ్ మూవీ. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన ఫిక్షన్, ఎమోషన్స్, కామెడీ, రొమాన్స్ వంటి అంశాలు కలగలిపి దర్శకుడు తెరకెక్కించాడు. ఆకట్టుకునే కథ, కథనం ఆద్యంతం మెప్పిస్తాయి. సెకండ్ హాఫ్ కొంచెం నెమ్మదిగా సాగడం, ఎడిటింగ్ నిరాశపరిచే అంశాలు. ఒకే ఒక జీవితం చిత్రంతో శర్వానంద్ పరాజయాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లే అని చెప్పొచ్చు.  

click me!

Recommended Stories