Brahmastram Review: 'బ్రహ్మాస్త్రం' ప్రీమియర్ షో టాక్.. స్టోరీ జస్ట్ ఓకే, కానీ అదరగొట్టేశారు

First Published Sep 9, 2022, 12:57 AM IST

బాలీవుడ్ క్రేజీ కపుల్స్ రణబీర్ కపూర్, అలీ భట్ జంటగా నటిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్రం. సూపర్ హీరో మూవీగా ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. పాన్ ఇండియా సినిమాగా దక్షణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

బాలీవుడ్ క్రేజీ కపుల్స్ రణబీర్ కపూర్, అలీ భట్ జంటగా నటిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్రం. సూపర్ హీరో మూవీగా ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. పాన్ ఇండియా సినిమాగా దక్షణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి రాజమౌళి ప్రజెంటర్ గా వ్యవహారిస్తున్నారు. బాలీవుడ్ లో వరుస పరాజయాలు, బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో బ్రహ్మాస్త్రంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. 

ఈ ఉత్కంఠ నడుమ బ్రహ్మాస్త్రం చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ముంబై లాంటి నగరాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. ప్రీమియర్ షోల నుంచి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకుందాం. పురాణాల్లో పవర్ ఫుల్ వెపన్స్ గా భావించే అస్త్రాలని గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఇలా పంచ భూతాలతో తయారు చేసారు అనే అంశంతో ఈ చిత్ర కథ ఉంటుంది. 

కొన్ని ఊహించని సంఘటనలు జరగడంతో శివ(రణబీర్ కపూర్) అలియా భట్ ని కకలుస్తాడు. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. ఎంతో శక్తివంతమైన అస్త్రాలని దుష్ట శక్తుల నుంచి రక్షించే వారి జాబితాలో శివ కూడా చేరుతాడు. అతడికి కొన్ని అతీత శక్తులు ఉంటాయి. ఈ చిత్రంలో రణబీర్, అలీ భట్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ ఐంది. 

స్టోరీ గొప్పగా లేదు కానీ ఓకె అని చెప్పొచ్చు. కానీ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సింపుల్ స్టోరీని చెప్పిన విధానం చాలా బావుంది అని అంటున్నారు. కథ కొన్ని చోట్ల గజిబిజిగా అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే ఉత్కంఠని మైంటైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. రణబీర్ కపూర్ ఈ కథకి అవసరమైన విధంగా తన నటన మార్చుకున్నాడు. అలియా భట్ తన పెర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేసింది. 

ఈ చిత్రంలో మరో సర్ప్రైజ్ ఏంటంటే.. దుష్ట శక్తి పాత్రలో మౌని రాయ్ అదరగొట్టేసింది. అమితాబ్, నాగార్జున తమ అనుభవంతో సినిమాకి అదనపు బలంగా మారారు. ఇక బాద్షా షారుఖ్ ఖాన్ రూపంలో ఆడియన్స్ కి బిగ్ సర్పైజ్ ఉంది. అయాన్ ముఖర్జీ ఈ చిత్రంలో ప్రతి పాత్రని చాలా తెలివిగా ఉపయోగించుకున్నారు. తెలుగు ఆడియన్స్ కి కింగ్ నాగార్జున రోల్ స్వీట్ షాక్ ఇచ్చే విధంగా ఉండబోతోంది. 

ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన బలంగా మారాయి. మరికొందరు ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని త్రీడీలో చూస్తేనే మంచి అనుభూతి ఉంటుందని అంటున్నారు. ఓవరాల్ గా ఒకసారి చూడదగ్గ చిత్రం అంటున్నారు. 

హాలీవుడ్ క్రిటిక్స్ నుంచి కూడా బ్రహ్మాస్త్ర చిత్రాన్ని పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ కష్టం, సినిమాపై ప్రేమ బ్రహ్మాస్త్ర చిత్రంలో కనిపిస్తుంది అని ప్రశంసిస్తున్నారు. పురాణాల నుంచి తీసుకున్న కాన్సెప్ట్ చాలా బావుంది. ఓవరాల్ గా దర్శకుడు ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ కి పురాణాల్ని జోడించి సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. కథపై ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే సినిమా ఒక వండర్ గా మారి ఉండేది అని అంటున్నారు. 

click me!