అమలాపాల్ లో ఈ మార్పు ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులతోనే మొదలైంది. అమలాపాల్ సినిమాలతో పాటు వ్యక్తిగత వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది.