ఫస్ట్ క్రష్‌ గురించి ఓపెన్‌ అయిన ఇలియానా.. గోవా బ్యూటీకే షాకిచ్చిన కుర్రాడు.. ఏం జరిగిందంటే?

Published : Sep 07, 2022, 09:12 PM IST

గోవా బ్యూటీ ఇలియానా హాట్‌ సెన్సేషన్‌గా మారుతున్న విషయం తెలిసిందే. సినిమాలు లేకపోవడంతో వెకేషన్‌లో, బీచ్‌లో తిరుగుతూ ఆయా గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఇలియానా. 

PREV
17
ఫస్ట్ క్రష్‌ గురించి ఓపెన్‌ అయిన ఇలియానా.. గోవా బ్యూటీకే షాకిచ్చిన కుర్రాడు.. ఏం జరిగిందంటే?

`పోకిరి` చిత్రంతో టాలీవుడ్‌ని ఊపేసిన ఇలియానా.. తాజాగా ఇన్నాళ్లు దాచుకున్న ఓ సీక్రెట్‌ బయటపెట్టింది. తన లైఫ్‌లో ఫస్ట్ క్రష్‌ గురించి ఓపెన్‌ అయ్యింది. తన ఫెయిల్యూర్‌ ఫస్ట్ క్రష్‌ గురించి తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఇలియానా దీనిపై ఓపెన్‌ అయ్యింది. తన జీవితంలోని అన్ని ఫస్ట్ అనుభవాల గురించి చెబుతూ ఇలా ఓపెన్‌ అయ్యింది ఇల్లీ బేబీ. 
 

27

ఇందులో ఇలియానా తన ఫస్ట్ క్రష్‌ గురించి చెబుతూ, తన పక్కింటి అబ్బాయిని ప్రేమించిందట. అతనిపై ఇష్టాన్ని పెంచుకుందని, కానీ ఆ కుర్రాడు మాత్రం పెద్ద షాకిచ్చాడట. ఇలియానాని తిరస్కరించాడట. తనని ఇష్టపడలేదని వెల్లడించింది గోవా బ్యూటీ. అయితే అది ఏ వయసులో జరిగిందనేది మాత్రం వెల్లడించలేదు. 
 

37

తన లైఫ్‌లో అదొక స్వీట్‌మెమొరిగా ఇప్పుడు మిగిలిపోయిందని, నవ్వుతూ చెప్పింది ఇలియానా. మొత్తంగా ఇన్నాళ్లకి మనసులో దాగున్నా రహస్యాన్ని బయటపెట్టింది. ఫ్యాన్స్ ని సర్ప్రైజ్‌ చేసింది `జల్సా` భామ. గతంలో ఓ ఇంగ్లీష్‌ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలోని ఈ విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం. ఇందులో చాలా విషయాలను తెలిపింది ఇలియానా. 
 

47

తన మొదటి జాబ్‌.. ఓ హోటల్‌ బ్రోచర్‌ కోసం ఫోటో షూట్‌ చేశానని తెలిపింది. అలాగే మొదటి శాలరీ సైతం ఓ మెగజీన్‌ కోసం ఫోటో షూట్‌ చేసినప్పుడు అందుకున్నానని, అయితే అది ఎంత అని మాత్రం చెప్పలేదు ఇలియానా. మొదటి కిస్‌ గురించి చెబుతూ, సినిమా సెట్‌లోనే జరిగిందని వెల్లడించింది. మొదటి లవ్ గురించి చెబుతూ అది గొప్ప ఫీలింగ్‌ అని వెల్లడించింది. ఎవరితో అనేది చెప్పలేదు ఇలియానా. 

57

ఇదిలా ఉంటే ఇలియానా కొన్నేళ్ల క్రితంలో లవ్‌ లో పడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియన్‌ ఫోటో గ్రాఫర్‌ ఆండ్రూ నీబోనే తో ప్రేమలో పడింది. వీరిద్దరు కలిసి డేటింగ్‌ చేసుకున్నారు. ఘాటు ప్రేమలో మునిగి తేలారు. పెళ్లి కూడా చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. కానీ 2019లో వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుతం ఈ బ్యూటీ సింగిల్‌గానే ఉన్నట్టు తెలుస్తుంది. 
 

67

ఇదిలా ఉంటే ఇలియానా డిప్రెషన్‌ని ఫేస్‌ చేసింది. ఆమె లవ్‌ ఫెయిల్యూర్‌ తర్వాత డిప్రెషన్‌కి వెళ్లిందని చెప్పింది. దాన్నుంచి కోలుకోవడానికి చాలా టైమ్‌ పట్టిందట. అదే సమయంలో తాను బాడీ షేమింగ్‌ కామెంట్లని ఎదుర్కొంది. దారుణమైన ట్రోల్స్ ని ఫేస్‌ చేశానని తెలిపింది. కానీ ఇప్పుడు వాటన్నింటిని ఎదుర్కొన్ని మళ్లీ సినిమాల్లో రాణించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది.
 

77

ఇలియానా లవ్‌ లో పడ్డాక కెరీర్‌ గాడి తప్పింది. బ్రేకప్‌ తర్వాత మళ్లీ హీరోయిన్‌గా రాణించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ బ్యూటీని ఎవరూ పట్టించుకోకపోవడం బాధాకరం. ఒకప్పుడు తిరుగులేని స్టార్‌గా రాణించిన ఈ బ్యూటీ ఇప్పుడు స్ట్రగులింగ్‌లో సాగుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ `అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ`తోపాటు మరో సినిమాలో నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories