మాస్‌ జాతర మూవీ ఫస్ట్ రివ్యూ, రవితేజకి అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ ?

Published : Oct 29, 2025, 04:34 PM IST

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన `మాస్‌ జాతర` మూవీ మరో రెండు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టాక్‌ బయటకు వచ్చింది. 

PREV
15
`మాస్‌ జాతర` మూవీపై అంచనాలు పెంచిన ట్రైలర్‌

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `మాస్‌ జాతర`. కొత్త దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇందులో యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల హీరోయిన్‌గా నటించడం విశేషం. `ధమాఖా` తర్వాత రవితేజ, శ్రీలీల కలిసి నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాని సాయి సౌజన్యతో కలిసి నాగవంశీ నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో(అక్టోబర్‌ 31న) విడుదల కాబోతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. మాస్‌ ఆడియెన్స్ కి కావాల్సిన మాస్‌ ఎలిమెంట్లు పుష్కలంగా ఉన్నాయని, ఆద్యంతం కామెడీ, రొమాన్స్, యాక్షన్‌ ప్రధానంగా సినిమా సాగుతుందని ఈ ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతోంది.

25
`మాస్‌ జాతర` సెన్సార్‌ టాక్‌

అదే సమయంలో సినిమా ఎలా ఉండబోతుందనేది ఫస్ట్ టాక్‌ వచ్చేసింది. ఇప్పటికే ఈ మూవీ సెన్సార్‌ పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికేట్‌ పొందింది. రెండు గంటల 23 నిమిషాలు నిడివి ఉంటుందట. అంటే ఇది డీసెంట్‌ డ్యూరేషన్‌గా చెప్పొచ్చు. ఇక సెన్సార్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిందని సమాచారం. సెన్సార్‌ సభ్యులు సినిమాని చూస్తున్నంత సేపు ఎంజాయ్‌ చేశారట. దీంతో టీమ్‌ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. మరోవైపు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా వచ్చిన హీరో సూర్య సైతం సినిమాపై అంచనాలను పెంచారు. రవితేజకి అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ అని, ఈ నెల 31 నుంచి రవి దే జాతర అని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తించారు. మరోవైపు చిత్ర దర్శకుడు కూడా తాజాగా సినిమాపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నాగవంశీనే సినిమాకి పెద్ద క్రిటిక్‌ అని, ఆయన నుంచి పాజిటివ్‌ టాక్‌ వచ్చిందంటే సినిమా బ్లాక్‌ బస్టరే అని తెలిపారు. ఇవన్నీ మూవీపై అంచనాలు పెరగడానికి కారణమయ్యాయని చెప్పొచ్చు.

35
`మాస్‌ జాతర` ఫస్ట్ రివ్యూ

ఈ నేపథ్యంలో సినిమా ఇప్పటికే చూసిన వారి నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. మూవీ బ్లాక్‌ బస్టర్‌ అంటున్నారు. ఇందులో వింటేజ్‌ రవితేజని చూడొచ్చు అంటున్నారు. సినిమాలో ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు ఎంటర్టైన్‌మెంట్‌ పుష్కలంగా ఉందని, మాస్‌ కమర్షియల్‌ అంశాలు కూడా గట్టిగానే ఉన్నాయని, అవి ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంటాయని, రవితేజ ఎనర్జీని మ్యాచ్‌ చేసేలా మ్యూజిక్‌ కుదిరిందని, మొత్తంగా బ్లాక్‌ బస్టర్స్ వైబ్స్ కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. సినిమా ప్రారంభంలోనే ఒక ఫైట్‌ ఉంటుందట, అది అదిరిపోతుందని, అలాగే రవితేజ, శ్రీలీల మధ్య రొమాన్స్, కామెడీ కూడా అలరిస్తుందని, మరోవైపు హీరో, విలన్‌ మధ్య సన్నివేశాలు కూడా గూస్‌ బంమ్స్ తెప్పించేలా ఉంటాయని అంటున్నారు. ఇందులో నవీన్‌ చంద్ర విలన్‌గా నటిస్తుండటం విశేషం.

45
జాతర ఎపిసోడ్‌ హైలైట్‌గా `మాస్‌ జాతర`

ట్రైన్‌లో అక్రమంగా గూడ్స్ రవాణా చేస్తుండగా, ఇంటర్వెల్‌లో వచ్చే ఫైట్‌ ఆద్యంతం కట్టిపడేస్తుందని, జాతర సీక్వెన్స్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఇది ఫుల్‌ ప్యాక్ కమర్షియల్‌ మూవీ అని అంటున్నారు. ఇంటర్వెల్‌ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా ఫాస్ట్ ఫేస్‌లో సాగుతుందని, ఒక రేస్‌లా ఉంటుందని, మధ్యలో ఎక్కడా డ్రాప్‌ ఉండదని నిర్మాత నాగవంశీ కూడా చెప్పారు. ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు సినిమాకి ఉన్న టాక్ ప్రకారం ఇది వింటేజ్‌ రవితేజని ఆవిష్కరించే మాస్‌ కమర్షియల్‌ మూవీ అయినా, ఆద్యంతం నవ్వులు పూయిస్తూనే ఎంటర్‌టైన్‌ చేస్తుందని తెలుస్తోంది.

55
రవితేజకి సాలిడ్‌ కమ్‌ బ్యాక్‌

రవితేజకి `ధమాఖా` తర్వాత సాలిడ్‌ హిట్‌ పడలేదు. వరుసగా డిజప్పాయింట్‌ చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు `మాస్‌ జాతర`తో వస్తున్నారు. అయితే ఈ చిత్రం ఆయనకు కమ్‌ బ్యాక్‌ మూవీ అవుతుందని, ఆయన్నుంచి ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎలాంటి మూవీ అయితే ఆశిస్తున్నారో, అలానే ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు. దీంతో ఈ సారి రవితేజ సాలిడ్‌ కమ్‌ బ్యాక్‌ ఇవ్వబోతున్నారని చెప్పొచ్చు. మరి నిజంగానే సినిమా అలా ఉంటుందా లేదా అనేది రెండో రోజుల్లో తేలనుంది. ఏషియానెట్‌ రివ్యూ కోసం వేచి ఉండండి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories