OG ఫస్ట్ టికెట్ వేలం పాట, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్ని లక్షలు పెట్టి కొన్నారంటే?

Published : Sep 03, 2025, 03:38 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈసినిమా రిలీజ్ కు ముందే బజ్ భయంకరంగా పెరిగిపోయింది. ఈసినిమా ఫస్ట్ టికెట్ ను వేలం వేయగా..ఎన్నిలక్షలుపలికిందో తెలుసా? 

PREV
15

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం OG పై Craze రోజురోజుకూ పెరుగుతోంది. సినిమా గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలు ప్రీ రిలీజ్ బుకింగ్స్ రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి, ముఖ్యంగా నార్త్ అమెరికాలో.. పవర్ స్టార్ క్రేజ్ భయంకరంగా వర్కౌట్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, OG సినిమాకు అమెరికాలో ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

25

కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ సినిమా 800,000 డాలర్లు అంటే సుమారుగా 6.6 కోట్ల వసూలు చేయడం గమనార్హం. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ నెల 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మొత్తం 1 మిలియన్ డాలర్లు దాటిందంటున్నారు. అయితే అఫీషియల్ గా సమాచారం మాత్రం రావాల్సి ఉంది. అంతే కాదు ఇది తెలుగు సినిమాల ప్రీమియర్ బుకింగ్స్‌లో అరుదైన ఘనతగా చెబుతున్నారు.

35

ఇక పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా మరో ప్రత్యేక కార్యకమం కూడా నిర్వహించారు. OG ఫస్ట్ టికెట్‌ను వేలం పాట ద్వారా విక్రయించగా, ఈ ఈవెంట్‌ను ట్విట్టర్ స్పేస్‌ ద్వారా నిర్వహించారు. ఈ వేలంపాటలో తెలుగు రాష్ట్రాలు, అమెరికాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.చివరికి ఈ OG ఫస్ట్ టికెట్‌ను నార్త్ అమెరికా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీం ఏకంగా 5 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా అందజేస్తామని వారు ప్రకటించారు.

45

మూడు రోజుల్లో ఈ డబ్బును పార్టీకి అందిస్తామన్నారు టీమ్. ఇక ఈ ఘటనపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతే కాదు ట్విట్టర్‌లో #OGFirstTicketAuction అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఒక్క సినిమా టికెట్‌కు లక్షల్లో ధర పలకడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ పట్ల అభిమానుల ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది.

55

ఈ టికెట్ వేలంతో OG సినిమాపై ఉన్న హైప్ మరింతగా పెరిగింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, OG ట్రైలర్ విడుదల తేదీపై అభిమానుల్లో కొంత నిరాశ కనిపిస్తోంది. ట్రైలర్‌ను ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు సమాచారం. గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు, ఆలస్యంపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories