వెడ్‌నెస్‌డే సీజన్ 2 పార్ట్ 2 సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. నాలుగు కొత్త ఎపిసోడ్‌లు, కొత్త నటీనటులు, ఆసక్తికర ట్విస్టులతో సిరీస్ కొనసాగుతుంది.
జెన్నా ఒర్టేగా నటించిన ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన సిరీస్ ‘వెడ్‌నెస్‌డే’ సీజన్ 2 పార్ట్ 2 నేడు (సెప్టెంబర్ 3) నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్టులో విడుదలైన పార్ట్ 1లో నాలుగు ఎపిసోడ్‌లు ప్రసారం కాగా, ఇప్పుడు చివరి నాలుగు ఎపిసోడ్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇండియాలో ఈ సిరీస్ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. పార్ట్ 2లో నాలుగు కొత్త ఎపిసోడ్ లతో రిలీజ్ అయింది. ఒక్కో ఎపిసోడ్ నిడివి దాదాపు గంట సమయం ఉంటుంది.
25
పార్ట్ 1 ఎండింగ్ రీక్యాప్
సీజన్ 2 పార్ట్ 1 చివర్లో టైలర్ వెడ్‌నెస్‌డేను విండో నుండి తోసివేయడంతో ఆమె ఆసుపత్రికి వెళ్తుంది. కొత్త ఎపిసోడ్‌లలో ఆమె కోలుకుని, తన మిషన్‌ను కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ఎనిడ్‌ను రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో ఆమెకు ఆత్మల రూపంలో మాజీ ప్రిన్సిపల్ లారిస్సా వీమ్స్ మద్దతు ఇస్తారు.
35
కొత్త ట్విస్టులు
మొదటి సీజన్‌లో హత్యకు గురైన ప్రిన్సిపల్ వీమ్స్ ఇప్పుడు స్పిరిచువల్ గైడ్‌గా వెడ్‌నెస్‌డేకు తోడుగా ఉంటారు. గూడీ అడమ్స్ మరణం తర్వాత ఇతర ఆత్మలు సహాయం చేయకపోవడంతో వీమ్స్ తిరిగి కనిపిస్తారు. టైలర్ మానసిక ఆసుపత్రి నుండి తప్పించుకోవడంతో, వెడ్‌నెస్‌డే, వీమ్స్ కలిసి ఎనిడ్‌ను కాపాడాల్సి ఉంటుంది.
జెన్నా ఒర్టేగా మళ్లీ వెడ్‌నెస్‌డేగా నటిస్తున్నారు. మోసా మోస్టఫా, నయోమి జె ఒగావా, జార్జీ ఫార్మర్, ఎమ్మా మేయర్స్, జాయ్ సండే లాంటి నటులు తమ పాత పాత్రల్లో కొనసాగుతున్నారు. కొత్తగా స్టీవ్ బుసెమీ, బిల్లీ పైపర్, ఎవీ టెంపుల్టన్, ఓవెన్ పెయింటర్, నోవా టేలర్ నటీనటుల జాబితాలో చేరారు.
55
గెస్ట్ రోల్స్ లో ఎవరెవరు ?
ప్రముఖ సింగర్ లేడీ గాగా ఇందులో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. క్రిస్టఫర్ లాయిడ్, జోయన్నా లమ్లీ, థాండివే న్యూటన్, ఫ్రాన్సెస్ ఓ’కానర్, హేలీ జోయెల్ ఒస్మెంట్, హీతర్ మటరాజ్జో, జూనాస్ ప్రత్యేక అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా, లేడీ గాగా రోసలైన్ రాట్‌వుడ్ పాత్రలో కనిపిస్తారు. ఆమె "ది థింగ్"తో కలిసి వైట్ డ్రెస్‌లో కనిపించే లుక్ ఇప్పటికే చర్చనీయాంశమైంది. సస్పెన్స్, థ్రిల్, కొత్త ట్విస్టులతో నిండిన వెడ్‌నెస్‌డే సీజన్ 2 పార్ట్ 2 నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకులకు వినోదం అందించనుంది. మిస్టరీ థ్రిల్లర్ ని ఇష్టపడే వారు ఈ సిరీస్ ని చూడవచ్చు.