OG 9 Days Collection: కాంతార చాప్టర్‌ 1 కి ఝలక్‌ ఇస్తోన్న పవన్ కళ్యాణ్.. ఓజీ బాక్సాఫీసు సునామీ

Published : Oct 04, 2025, 07:39 PM IST

OG 9 Days Collection:  సుజీత్ దర్శకత్వంలో వచ్చిన 'దే కాల్ హిమ్ ఓజీ' 9 రోజుల్లో ఎంత కలెక్ట్  చేసిందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మూవీ `కాంతార 2`కి ఝలక్‌ ఇస్తుండటం విశేషం. 

PREV
14
ఓజీ బాక్సాఫీస్ కలెక్షన్

సుజీత్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'దే కాల్ హిమ్ ఓజీ' మొదటి వారంలో బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన ఇచ్చింది. సెప్టెంబర్ 25న విడుదలై, 24న పెయిడ్ ప్రీమియర్లతో, ఈ పవన్ కళ్యాణ్ సినిమా 7 రోజుల్లోనే ₹160 కోట్లు(నెట్‌) దాటింది. ఎనిమిదో రోజు  కూడా ఈ చిత్రానికి అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. ఇక శుక్రవారం 9వ రోజు ( అక్టోబర్ 3)'దే కాల్ హిమ్ ఓజీ' తెలుగు ఆక్యుపెన్సీ 29.89%గా ఉంది. ఉదయం షోలకు 22.79%, మధ్యాహ్నం షోలకు 36.98% ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ సినిమా రెండో వారంలో కూడా మంచి ఆక్యుపెన్సీని సాధించడం విశేషం. సినిమాకి ఇంకా ఆదరణ ఉందంటే మామూలు విషయం కాదు. సాధారణంగా కమర్షియల్‌ చిత్రాలు మొదటి  వారంలోనే క్లోజ్‌ అవుతుంటాయి. 

24
ఓజీ మూవీ 9వ రోజు కలెక్షన్లు

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వచ్చిన `ఓజీ` మూవీ తొమ్మిదో రోజు కూడా సత్తా చాటింది. ఈ చిత్రానికి ఇంకా మంచి కలెక్షన్లు రావడం విశేషం. ఇక తొమ్మిదో రోజు ఈ మూవీ సుమారు  రూ.3.81  రావడం విశేషం. దాదాపు ఆరున్నర కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఓ వైపు `కాంతార 2` నడుస్తుండగా ఈ చిత్రానికి ఇంతటి కలెక్షన్లు రావడం ట్రేడ్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.  దీంతో ఇప్పటి వరకు ఈ మూవీ తొమ్మిది రోజుల్లో దాదాపుగా రూ.171.58 కోట్లు రాబట్టడం విశేషం.  ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ.271కోట్ల గ్రాస్‌ కలెక్షన్లని  సాధించింది. ఆల్మోస్ట్ ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌కి దగ్గరగా ఉంది. ఈ శనివారం, ఆదివారాల కలెక్షన్లు పెరిగితే సినిమా సేఫ్‌లోకి వెళ్తుంది. మరి అది సాధ్యమేనా అనేది చూడాలి. 

34
కాంతార 2కి ఝలక్‌ ఇస్తోన్న ఓజీ

 ప్రస్తుతం థియేటర్లలో `కాంతారః చాప్టర్‌ 1`(కాంతార 2) సందడి చేస్తోంది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించినా `కాంతార`కి ప్రీక్వెల్‌గా రావడంతో ఆడియెన్స్ లో క్రేజ్‌ ఉంది. అది కలెక్షన్ల విషయంలో హెల్ప్ అవుతుంది. దీనికితోడు పండగ సెలవులు ఉండటంతో సినిమాని జనం చూస్తున్నారు. బాగానే ఆదరిస్తున్నారు. ఈ ఆదివారం వరకు ఈ మూవీ ప్రభావం ఉండనుంది. ఈ క్రమంలో `కాంతార 2` ఎఫెక్ట్ ఉన్నా కూడా `ఓజీ` సినిమాకి అదిరిపోయే వసూళ్లు  వస్తున్నాయి. ఇది `ఓజీ` టీమ్‌కి హ్యాపీగా అనిపించే విషయం. ఓ రకంగా `ఓజీ` చాలా చోట్ల `కాంతార 2` కలెక్షన్లకి దెబ్బకొడుతుందని సమాచారం. 

44
ముంబయి గ్యాంగ్‌ స్టర్‌ నేపథ్యంలో `ఓజీ`

 ఓజీ మూవీని దర్శకుడు సుజీత్‌ ఆద్యంతం స్టయిలీష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ముంబయి గ్యాంగ్‌ స్టర్‌ నేపథ్యంలో సినిమాని మలిచారు. ఇందులో పవన్‌ ఓజాస్‌ గాంభీరగా గ్యాంగ్‌స్టర్‌గా ఆకట్టుకున్నారు. ఆయన స్టయిలీష్‌ యాక్టింగ్‌, యాక్షన్‌ సీన్లు అదిరిపోయాయి. ఆడియెన్స్ కి పూనకాలు తెప్పించాయి. పవన్‌ ఫ్యాన్స్ సినిమాని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత పవన్‌ని తమకు కావాల్సిన విధంగా, తాము కోరుకున్న విధంగా కనిపించడంతో వారంతా పండగ చేసుకుంటారు. థియేటర్‌ పవన్‌ మేనియాకి ఫిదా అవుతున్నారు. దీంతో ఈ మూవీ భారీ వసూళ్ల దిశగా వెళ్తోంది. ఈ చిత్రంతో పవన్‌కి జోడీగా ప్రియాంక మోహన్‌ నటించింది. ప్రకాష్‌ రాజ్‌, ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, తేజ్‌ సప్రూ, శ్రియా  రెడ్డి  కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories