Anasuya Bharadwaj: అనసూయ కమ్‌ బ్యాక్‌ మూవీ ఇదే.. ఈ సారి ర్యాంప్‌ ఆడించడం పక్కా, ఆ ఏడేళ్లు ఏం జరిగిందంటే?

Published : Oct 04, 2025, 06:49 PM IST

జబర్దస్త్ మాజీ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ కొంత గ్యాప్‌తో ఇప్పుడు మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు వస్తోంది. ఆమె `అరి` చిత్రంతో అలరించబోతుంది. ఇందులో ఆమె చేసే రచ్చ వేరే లెవల్‌లో ఉండబోతుందట. 

PREV
15
`పుష్ప 2`తో అలరించిన అనసూయ భరద్వాజ్‌

జబర్దస్త్ మాజీ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌ కొంత గ్యాప్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. చివరగా `హరి హర వీరమల్లు` చిత్రంలో మెరిసింది. ఇందులో ఆమె కేవలం పాటలోనే నర్తించింది. అంతకు ముందు గతేడాది వచ్చిన `పుష్ప 2`లో సందడి చేసింది. ఇందులో నెగటివ్‌ రోల్‌ చేసింది. కాకపోతే మొదటి పార్ట్ లో హైలైట్‌ అయినంతగా రెండో పార్ట్ లో హైలైట్‌ కాలేకపోయింది. మిగిలిన రోల్స్ బలంగా ఉండటంతో అనసూయ పాత్ర ప్రభావం పెద్దగా లేదు. కొత్తగా మరే సినిమాలను ప్రకటించలేదు అనసూయ. ఇక జబర్దస్త్ మాజీ యాంకర్‌కి సినిమాలు లేవనే టాక్‌ వినిపించిన ఇప్పుడు మరో మూవీతో రాబోతుంది. చాలా గ్యాప్‌తో ఆమె సందడి చేయబోతుంది.

25
`అరి`తో రచ్చ చేసేందుకు వస్తోన్న అనసూయ

అనసూయ కమ్‌ బ్యాక్‌ అయ్యే మూవీ ఏంటో తేలిపోయింది. `అరి` అనే సినిమా ద్వారా ఆమె వెండితెరపై రచ్చ చేసేందుకు వస్తోండటం విశేషం. అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తున్న `అరి`(మై నేమ్‌ ఈజ్‌ నో బడీ) రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది టీమ్‌. `పేపర్‌ బాయ్‌` ఫేమ్‌ దర్శకుడు జయశంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం.  అనసూయతోపాటు వినోద్‌ వర్మ, సాయి కుమార్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో అనసూయ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నట్టు సమాచారం. ఆర్వీ సినిమాస్‌ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి(ఆర్‌వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్‌ రామిరెడ్డి, శేషు రెడ్డి మారంరెడ్డి, నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని అక్టోబర్‌ 10న రిలీజ్‌ చేయబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కమర్షియల్ ఎలిమెంట్స్ తోపాటు ఒక మంచి మెసేజ్ తో ‘అరి’ సినిమాను రూపొందించారు. విడుదలైన మూవీ కంటెంట్‌కి రియాక్షన్‌ బాగుంది. ఈ మూవీతో తాను స్ట్రాంగ్‌గా కమ్‌ బ్యాక్‌ కావాలని చూస్తోంది అనసూయ. ఇందులో ఆమె విలనిజం అదిరిపోయేలా ఉంటుందట.

35
`అరి` మూవీ కోసం దర్శకుడు సాహసం

ఈ సినిమా స్టార్ట్ అయి చాలా రోజులే అవుతుంది. ఈ క్రమంలో సినిమా డిలేకి కారణాలను, అలాగే సినిమాలో ఏం చూపించబోతున్నారనే విషయాలను టీమ్‌ తెలిపింది. అదే సమయంలో ఈ మూవీ కోసం ఆయన పడ్డ కష్టం తెలియజేశారు. దర్శకుడు జయశంకర్‌ ఏడేళ్లపాటు హిమాలయాల్లోకి వెళ్లి అదృశ్యమయ్యారట. తనలోని ఆరు అంతర్గత శత్రువులను ఎలా జయించాలనేదానిపై దృష్టి పెట్టి ఆయన వెళ్లారు. ``మౌనం అంచున, నక్షత్రాల క్రింద గడిపిన ఆ ఏడేళ్లలో, ఆయన సాధ్గురువులు, సన్యాసులు, సంచార గురువుల నుండి జ్ఞానాన్ని పొందారు. కంచి కామకోటి పీఠం నుండి ఇస్కాన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, చిన్మయ మిషన్ వరకు భారతదేశంలోని 20కి పైగా ఆధ్యాత్మిక సంస్థలను సందర్శించారు. భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, యోగ వాసిష్ఠం వంటి గ్రంథాలలో పూర్తిగా మునిగిపోయారు. ఆరు అంతర్గత శత్రువులైన జయించే మానవీయ, ఆచరణాత్మక మార్గాలను కనుగొన్నారు. ఈ మార్గాలు సన్యాసులకే కాదు, ఆధునిక జీవితంలో కష్టపడుతున్న ప్రతి ఒక్కరికీ సహాయపడగలవు` అని టీమ్‌ తెలిపింది.

45
`అరి` మూవీకి అంతర్జాతీయ గుర్తింపు

టీమ్‌ ఇంకా చెబుతూ, ఈ త్యాగం నుంచే ‘అరి – My Name is Nobody’ చిత్రం పుట్టింది. ఇది కేవలం సినిమా కాదు, అంతర్గత స్వస్థత కోసం రూపొందించిన భావోద్వేగ పటం. సాధారణ ఆధ్యాత్మిక ఉపదేశాల మాదిరి కాకుండా, 'అరి' కథనం ద్వారా ప్రేక్షకులకు  కోపం, అత్యాశ, అహంకారం, భ్రమ, అసూయ వంటి యుద్ధాలను అనుభూతి చెందేలా చేస్తుంది. ప్రాచీన నివారణ మార్గాలను ఆధునిక మనస్సులు ఉపయోగించుకునే విధంగా చూపుతుంది. సినిమా మెయిన్‌స్ట్రీమ్‌లోకి రాకముందే, దాని ప్రభావం సహజంగా విస్తరించింది. ఆధ్యాత్మిక గురువులు దీనిని ఆశ్రమాలు, యోగా కేంద్రాలలో ప్రదర్శించడం ప్రారంభించారు. మానసిక నిపుణులు ఈ చిత్రాన్ని భావోద్వేగ సమతుల్యత కోసం సిఫార్సు చేస్తున్నారు. కళ, ఆధ్యాత్మిక జ్ఞానం ప్రత్యేక సమ్మేళనానికి గాను, స్వీడన్ నుండి బెల్జియం వరకు ఆరు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకోవడం విశేషం` అని చెప్పింది.

55
అనసూయ కమ్‌ బ్యాక్‌ అవుతుందా?

`ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ఫిల్మ్ ఫెస్టివల్స్ జయశంకర్‌ను ఆహ్వానించి, ఆయన పని గురించి మాట్లాడాల్సిందిగా కోరాయి. ప్రపంచం 'అరి' అందాన్ని చూస్తుంది, కానీ దాని సృష్టికి ఆయన చెల్లించిన మూల్యం గురించి కొందరికే తెలుసు. ఏడేళ్లపాటు ఆదాయం లేదు. స్నేహాలు దూరమయ్యాయి. సినీ పరిశ్రమ కనెక్షన్లు కనుమరుగయ్యాయి. "ఇదంతా విలువైనదేనా?" అనే ప్రశ్న పర్వతాల మౌనంలో ప్రతిధ్వనించేది. అయినప్పటికీ, జయశంకర్ కొనసాగారు, ఎందుకంటే కొన్ని కథలు తొందరపాటుకు పనికిరావు, కొన్ని దర్శనాలు రాజీపడటానికి వీలు లేకుండా చాలా పవిత్రమైనవి. కొత్త భగవద్గీత వంటి ఒక గొప్ప చిత్రం` అని తెలిపింది.  `అరి` సినిమా కోసం దర్శకుడు చాలా త్యాగాలు, సాహసాలు చేశారు. ఆ రేంజ్‌లో సినిమా ఉంటుందా? ఆడియెన్స్ ని అలరిస్తుందా? ఈ మూవీతో అనసూయ హిట్‌ అందుకుంటుందా? కమ్‌ బ్యాక్‌ అవుతుందా అనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories