ఓజీ నటి శ్రీయా రెడ్డి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.. తండ్రి క్రికెటర్, భర్తేమో ఆ స్టార్ హీరోకి బ్రదర్

Published : Sep 22, 2025, 05:26 PM IST

Sriya Reddy : ఓజీ చిత్రంలో కీలక పాత్రలో నటించిన శ్రీయ రెడ్డి ఫ్యామిలీ గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఆమె తండ్రి గతంలో టీమిండియా తరఫున ఆడిన క్రికెటర్. మరిన్ని వివరాలు కోసం ఈ కథనం చదవండి. 

PREV
15
ఫ్యాన్స్ లో ఓజీ ఫీవర్

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజీ ఫీవర్ తో ఊగిపోతున్నారు. రిలీజ్ టైం దగ్గరపడే కొద్దీ ఓజీ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ ని డైరెక్టర్ సుజీత్ మునుపెన్నడూ చూడని విధంగా ప్రజెంట్ చేస్తుండడంతో ఫ్యాన్స్ లో ఈ స్థాయి క్రేజ్ ఏర్పడింది. ఇంతటి ఫైరీ పెర్ఫార్మెన్స్ ఉండే మూవీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ చేయలేదు. 

25
శ్రీయా రెడ్డి ఫిట్నెస్ పై పవన్ ప్రశంసలు 

 ఈ చిత్రంలో అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా.. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించారు. ఓజీ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి లాంటి వారు సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతున్నారు. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ శ్రీయా రెడ్డిపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఆమె ఫిట్ నెస్ లెవల్స్ చూస్తే మతిపోద్ది అని, ఆమెతో గొడవ పెట్టుకోవాలంటే ఎవరైనా ఆలోచించాల్సిందే అని పవన్ అన్నారు. దీనితో సినీ అభిమానులు శ్రీయా రెడ్డి బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

35
శ్రీయా రెడ్డి తండ్రి ఎవరో తెలుసా ?

అసలు శ్రీయా రెడ్డి ఎవరు ? ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి? ఎలాంటి చిత్రాల్లో నటించారు లాంటి వివరాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. శ్రీయా రెడ్డి టీమిండియా మాజీ క్రికెటర్ భరత్ రెడ్డి కుమార్తె. భరత్ రెడ్డి 1978 నుంచి 1981 వరకు టీమిండియా క్రికెటర్ గా రాణించారు. అంతర్జాతీయ టెస్టులు, వన్డే మ్యాచ్ లు ఆడారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఆయన చెన్నైలో క్రికెట్ ట్రైనింగ్ క్యాంప్ లు నిర్వహించారు. దినేష్ కార్తీక్, లక్ష్మీ పతి బాలాజీ లాంటి క్రికెటర్లు భరత్ రెడ్డి ట్రైనింగ్ నుంచి రాటుదేలినవారే. 

45
బుల్లితెరపై కెరీర్ ప్రారంభం 

శ్రీయా రెడ్డి కాలేజీలో చదువుతున్నప్పుడే ఆమెకి మోడలింగ్ లో అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె తండ్రి ముందుగా ఎడ్యుకేషన్ పూర్తి చేయాలని సూచించారు. ఎడ్యుకేషన్ పూర్తయ్యాక ఓ ఛానల్ లో శ్రీయా రెడ్డికి వీజేగా అవకాశం వచ్చింది. ఆ విధంగా శ్రీయా రెడ్డి తన కెరీర్ ని బుల్లితెరపై ప్రారంభించారు. ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు అందుకోవడం ప్రారంభించింది. విశాల్ పొగరు చిత్రంలో నెగిటివ్ షేడ్స్ నటించి అందరినీ మెప్పించింది. తెలుగులో ఆమె అమ్మ చెప్పింది, అప్పుడప్పుడు, సలార్ లాంటి చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఓజీ మూవీతో ఆడియన్స్ ని పలకరించబోతోంది. 

55
శ్రీయా రెడ్డి, విశాల్ మధ్య బంధుత్వం ఏంటో తెలుసా ?

శ్రీయా రెడ్డి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె వివాహం చేసుకున్నది హీరో విశాల్ సోదరుడినే. విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణ, శ్రీయా రెడ్డి 2008లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పొగరు చిత్రానికి విక్రమ్ కృష్ణ నిర్మాత. ఆ మూవీ సమయం నుంచే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 

Read more Photos on
click me!

Recommended Stories