టీలు, కాఫీలు అందించే వ్యక్తి ఎంత అద్భుతం చేశాడో తెలుసా.. లేకుంటే చిరంజీవి సినిమా అట్టర్ ఫ్లాప్

Published : Oct 23, 2025, 03:28 PM IST

Chiranjeevi: చిరంజీవి కెరీర్ లో అద్భుతం అంటే ఇదే. టీలు అందించే పని అబ్బాయ్ లేకుంటే చిరంజీవి సినిమా ఫ్లాప్ అయ్యేది. అసలేం జరిగింది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
ఫ్లాప్ నుంచి తప్పించుకున్న చిరంజీవి 

కొన్ని సినిమాలు చిన్న తప్పిదాల వల్ల ఫ్లాప్ అవుతుంటాయి. సినిమా మొత్తం బావున్నా కథలో కీలకమైన అంశం కనెక్ట్ కాకుంటే ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి చిన్న పొరపాటు వల్ల మెగాస్టార్ చిరంజీవి కూడా పెద్ద ఫ్లాప్ ఎదుర్కొనబోయారు. కానీ అదృష్టం కొద్దీ ఆ తప్పు తెలియడం, దానిని సరిచేసుకోవడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంతకీ ఆ చిత్రం మరేదో కాదు.. ఫ్లాపుల్లో ఉన్న చిరంజీవిని గట్టెక్కించిన హిట్లర్. 

25
మలయాళీ చిత్రానికి రీమేక్ 

హిట్లర్ సినిమా విషయంలో తెరవెనుక పెద్ద తంతంగమే నడిచింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఎడిటర్, నిర్మాత మోహన్ నిర్మించారు. మలయాళంలో మమ్ముట్టి నటించిన చిత్రానికి ఇది రీమేక్. మలయాళంలో కూడా హిట్లర్ అనే టైటిలే ఉంటుంది. ఈ చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేయాలని అనుకున్నారు. రీమేక్ హక్కులు సొంతం చేసుకుని కథలో అవసరమైన మార్పుల గురించి చర్చలు జరిపారు. 

35
ఈ సినిమా ఆడదని తేల్చేసిన ఆఫీస్ బాయ్ 

చిరంజీవి సినిమా అంటే తప్పనిసరిగా డ్యాన్సులు, పాటలు, ఫైట్స్ ఉండాలి. అవన్నీ కథలో చక్కగా చేర్చారు. ఇక షూటింగ్ కి రెడీ అవ్వడం కోసం మోహన్ తన ఆఫీస్ లో టీమ్ తో చర్చలు జరుపుతున్నారు. వారందరికీ టీ, కాఫీ, బిస్కెట్స్ ఇచ్చే ఆఫీస్ బాయ్ తనకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు అని మోహన్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ''ఆఫీస్ బాయ్ అందరికీ టీలు, బిస్కెట్స్ ఇస్తూ నా దగ్గరకు వచ్చాడు. నాకు కూడా టీ ఇచ్చి.. సార్ ఈ సినిమా తెలుగులో ఆడదు సార్ అని చెవిలో చెప్పి వెళ్ళిపోయాడు. 

45
అతడు చెప్పిన రీజన్ ఇదే 

 నేను అందరినీ మీటింగ్ నుంచి త్వరగా పంపేశాను. ఆఫీస్ బాయ్ అన్న మాటే గుర్తుకు వస్తోంది. అతడిని పిలిచాను. ఏంట్రా ఇంతకు ముందు ఏదో అన్నావు అని అడిగా.. అవునండీ ఈ సినిమా తెలుగులో ఆడదు అని మళ్ళీ చెప్పాడు. నాకు టెన్షన్ పెరిగిపోయింది. అసలు ఎందుకు ఆడదో చెప్పారా అని అడిగా. ఈ కథలో అన్న ఏంటండీ అలా ఉన్నాడు.. చెల్లెళ్లకు పెళ్లి చేయడు.. వాళ్ళు లవ్ చేస్తే ఒప్పుకోడు.. ఇలా ఉంటే ఆడియన్స్ కి నచ్చదు'' అని చెప్పాడు. 

55
కథలో మార్పులు 

అతడు చెప్పింది చాలా అద్భుతమైన పాయింట్ అని అనిపించింది. కథలో అన్నీ సరిచేశాం. ఇదొక్కటే ఎలా మిస్ అయ్యాం అని అనిపించింది. వెంటనే కథలో మార్పులు చేశాం. అన్నయ్య తన పెద్ద చెల్లికి కలెక్టర్ సంబంధం తీసుకురావడం అనే అంశాన్ని చేర్చాం. పెళ్లికి అన్నయ్య ఏర్పాట్లు చేస్తున్నాడు. కానీ పెద్ద చెల్లి ఊహించని సమస్యలో చిక్కుకుంటుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్టర్ తో కాకుండా మరో వ్యక్తితో పెళ్లి చేస్తున్నాడు అనే అంశం చేర్చినట్లు మోహన్ తెలిపారు. హిట్లర్ చిత్రం ఘనవిజయం సాధించింది. చిరంజీవి వరుస పరాజయాలకు అడ్డుకట్ట వేసిన చిత్రం ఇది. 

Read more Photos on
click me!

Recommended Stories