బాత్ రూంలోకి వెళ్లి మరీ ఏడ్చా.. ‘టైగర్ నాగేశ్వర రావు’ హీరోయిన్ నుపూర్ సనన్ లవ్ బ్రేకప్ స్టోరీ.!

First Published | Oct 16, 2023, 10:33 AM IST

‘టైగర్ నాగేశ్వర రావు’ హీరోయిన్ నుపుర్ సనన్ ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటోంది. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ నూ షేర్ చేసుకుంటోంది. తన లవ్ బ్రేకప్ స్టోరీని చెప్పడం హాట్ టాపిక్ గ్గా మారింది. 
 

బాలీవుడ్ యంగ్ బ్యూటీ నుపూర్ సనన్ (Nupur Sanon) టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. హిందీలో ఒక చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ నేరుగా తెలుగు పరిశ్రమలోకి వస్తోంది. రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ (Tiger Nageswara Rao) చిత్రంతో అలరించబోతోంది. 
 

టాలీవుడ్ లో నుపుర్ సనన్ కు ‘టైగర్ నాగేశ్వర రావు’ తొలిచిత్రం కావడంతో ఈ ముద్దుగుమ్మ ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటోంది. నాలుగు రోజుల్లో సినిమా రాబోతుడటంతో ఇంటర్వ్యూలు, ఈవెంట్లకు హాజరవుతూ ఆకట్టుకుంటోంది. 


మరోవైపు తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ అందిస్తూ ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా నుపుర్ సనన్  ఓ ఇంటర్వ్యూలో తన లవ్ బ్రేకప్ స్టోరీని చెప్పడం హాట్ టాపిక్ గ్గా మారింది.  స్టూడెంట్ గా ఉన్నప్పుడే ఆమె ప్రేమ విఫలమైందంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత జరిగిన కథని వివరించింది.
 

ఎవర్నైనా ప్రేమించారా? అనే ప్రశ్నకు నుపూర్ సనన్ బదులిస్తూ.. కాలేజీలో  ఉన్నప్పుడు ఓ అబ్బాయిని ఇష్టపడ్డాను. గాఢంగా ప్రేమించాను. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాను. గుడ్డిగా అతన్ని నమ్మాను. చివరి అతను నన్ను మోసం చేశాడు. ఆ బాధ తట్టుకోలేకపోయాను. 
 

నా లవ్ ఫెల్యూర్ అయ్యాక చాలా ఏడ్చాను. ఎంతో బాధపడ్డాను. ఇంట్లో వాళ్లకి ఈ విషయం తెలియదు. ఎక్కడ తెలుస్తుందోనని అర్ధరాత్రి బాత్ రూమ్ లోకి వెళ్లి మరీ  ఏడ్చేదాన్ని. ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి చాలా సమయం పట్టింది. ప్రస్తుతం కెరీర్ పైనే ఫోకస్ పెట్టాను. అంటూ చెప్పుకొచ్చింది.
 

ఇక ‘టైగర్ నాగేశ్వర రావు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా జరిగింది. కార్యక్రమంలో ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది నుపూర్. క్యూట్ స్పీచ్ తోనూ ఆకట్టుకుంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 20న ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మూవీలో రేణూ దేశాయ్. అనుపమ్ ఖేర్, గాయత్రీ భరద్వాజ్, మురళీ వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Latest Videos

click me!