ఎపిసోడ్ ప్రారంభంలో కనకం దంపతులు కావ్య వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్లని అవమానించేలాగా మాట్లాడుతుంది రుద్రాణి. రుద్రాణిని మందలిస్తుంది చిట్టి. వాళ్లు నీకు కన్యాదానం చేసిన వాళ్లు, దానం తీసుకున్న దానివి ఒక మెట్టు కిందనే ఉండాలి అంటూ కనకం దంపతులని కూర్చోమని ఆహ్వానిస్తుంది చిట్టి. కుశల ప్రశ్నలు ఆయన తరువాత స్వప్నని మాతోపాటు తీసుకువెళ్దాం అనుకుంటున్నాను అంటుంది కనకం.
ఆ పని చేయండి లేదంటే తనకి ఏం జరిగినా మేమే ఏదో చేసేసాం అంటారు. తనకి కాపలా కాస్తూ ఎవడు కూర్చుంటాడు అంటుంది రుద్రాణి. అంటే సీమంతం సంగతి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని కోప్పడుతుంది చిట్టి. ఓ అదొకటుంది కదా మర్చిపోయాను అంటుంది రుద్రాణి. అప్పుడు చిట్టి మాట్లాడుతూ స్వప్నకి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియటం లేదు, తనని నీకంటే బాగా ఎవరు చూసుకుంటారు అందుకే తనని చూసుకోవటానికి నువ్వే ఇక్కడ ఉండొచ్చు కదా అంటుంది చిట్టి.
ఆ స్వప్న, కావ్య ఇద్దరు భయపడతారు.అమ్మ ఇంట్లో ఉంటే అత్తయ్య రుద్రాణి అమ్మని చులకనగా చూస్తారు అనుకుంటుంది కావ్య. అమ్మ ఇంట్లో ఉంటే నిజం తెలిస్తే చెప్పినా చెప్పేస్తుంది అని అనుకుంటుంది స్వప్న. అపర్ణ మంచి కేర్ టేకర్ ని పెట్టుకోవచ్చు అంటుంది. కావ్య కూడా అమ్మ ఇక్కడ వద్దులేండి అంటుంది కానీ చిట్టి వినిపించుకోదు, అమ్మకు మించిన కేర్ టేకర్ ఎవరు ఉంటారు అంటుంది దాంతో కనకానికి అక్కడ ఉండిపోక తప్పదు.
నేను బయలుదేరుతాను అని చెప్పి కృష్ణమూర్తి బయటికి వస్తాడు. అతని వెనకే వచ్చిన కనకం ఏదో చూడ్డానికి వస్తే ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది, నాకు బట్టలు పంపించండి అంటుంది. పోనీలే నీ ముద్దుల కూతురి కోసమే కదా అంటాడు కృష్ణమూర్తి. ఇప్పుడు నా ముద్దుల కూతురు స్వప్న కాదు కావ్య అంటుంది కనకం. అప్పుడే పార్టీ మార్చేశావా అని నవ్వుతాడు కృష్ణమూర్తి. అతనికి జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపిస్తుంది కనకం.
మరోవైపు చీర కట్టుకొని అద్దంలో తనని తాను చూసుకుంటుంది అప్పు. కళ్యాణ్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది. ఇంతలో కళ్యాణ్ వచ్చి డోర్ కొడతాడు. ఆ చీర విప్పి కింద పడేసి డోర్ తీస్తుంది అప్పు. సారీ నీకు అలాంటి గిఫ్ట్లు నచ్చవని తెలుసు అయినా అనామిక ఆడపిల్ల, మనసు అంటూ ఏవేవో చెప్పి ఈ చీర నీకు ఇచ్చింది అంటాడు కళ్యాణ్. నచ్చలేదు ఎవరు చెప్పారు నాకు ఆ చీర బాగా నచ్చింది అంటుంది అప్పు. అక్కడే కిందపడి ఉన్న చీరని చూస్తాడు కళ్యాణ్.
ఆ చీర ని చూస్తేనే తెలుస్తుంది నీకు నచ్చిందో లేదో అంటూ ఆ చీరని తీసి మడతపెట్టి ఫస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్ వెనక్కి తీసుకోకూడదు అందుకే నా గుర్తుగా నీ దగ్గరే ఉంచు. bఈసారి నీకు మళ్ళీ మంచి గిఫ్ట్ ఇస్తాను అంటాడు. ఇప్పుడు నిన్ను ఎవరు గిఫ్ట్లు అడిగారు ఇంతకీ వచ్చిన పని ఏంటి అంటుంది అప్పు. ఎంగేజ్మెంట్ లేకుండానే నేరుగా పెళ్లి చేయటానికి అందరూ నిశ్చయించుకున్నారు అది చెప్పడానికే వచ్చాను అంటాడు కళ్యాణ్.
నువ్వు అన్ని విషయాల్లోనే క్లారిటీగా ఉన్నావు, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అంటుంది అప్పు. కళ్యాణ్ అక్కడినుంచి వెళ్లిపోయిన తర్వాత బాధగా కింద కూర్చుని పోతుంది. మరోవైపు కనకంతో పాటు భోజనం చేయడానికి ఇష్టపడని అపర్ణ భర్తతో అదే విషయాన్ని చెప్తుంది. ఎందుకు నీకు తనంటే ఇష్టం లేదు, అంటూ ఆమెకి చాలాసేపు నచ్చి చెప్తాడు సుభాష్.
మనం పెద్దవాళ్ళం కొన్ని విషయాల్లో మనం గుంబనగా ఉండాలి అప్పుడే మన పెద్దరికం ని కాపాడుకోగలం అని చెప్పి భార్యని భోజనానికి తీసుకువెళ్తాడు. అక్కడ కావ్య తో పాటు కనకం కూడా వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడే అపర్ణ దంపతులు వాళ్ళు కూడా భోజనానికి కూర్చుంటారు. నువ్వు కూర్చో అమ్మ నేను వడ్డిస్తాను అంటుంది కావ్య. మీ అమ్మకి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం రాదేమో నాకు గదిలో చాప ఉంది తీసుకొని వచ్చి కింద వడ్డించు కావలసినంత తింటుంది అంటుంది రుద్రాణి.
వాళ్లు మరీ అంత పేదవాళ్లు కాదు వాళ్ళ ఇంట్లో కూడా డైనింగ్ టేబుల్ ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలా కింద, మీద అని అవమానించేలాగా మాట్లాడరు. అభిమానంగా చూస్తారు అంటూ రుద్రాణికి చివాట్లు పెట్టి కనకాన్ని ఒప్పించి భోజనానికి కూర్చోబెడతాడు రాజ్. పర్వాలేదు రాజ్ అత్తగారిని ఎలా చూసుకోవాలో త్వరగానే నేర్చుకున్నావ్ అంటాడు సీతారామయ్య. రుద్రాణి కి అంతస్తులు చూడటం తప్పితే మర్యాదలు చేయడం తెలియదు అని చివాట్లు పెడతారు ప్రకాష్ దంపతులు. తరువాయి భాగంలో భార్యకి పాన్ తినిపించడం కోసం బైక్ మీద అర్ధరాత్రి బయటికి తీసుకువెళ్తాడు రాజ్ ఆనందపడుతుంది కావ్య.