పద్ధతిగా చీరకట్టినా.. తడి అందాలతో మంటపెట్టేసిందిగా.. ప్రియా వారియర్ బ్యూటీఫుల్ స్టిల్స్

Sreeharsha Gopagani | Published : Oct 16, 2023 9:30 AM
Google News Follow Us

సౌత్ లో నటిగా గుర్తింపు దక్కించుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం హిందీలో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ క్యూట్ ఫొటోస్ ఆకట్టుకుంటోంది.
 

16
పద్ధతిగా చీరకట్టినా.. తడి అందాలతో మంటపెట్టేసిందిగా.. ప్రియా వారియర్ బ్యూటీఫుల్ స్టిల్స్

కన్నుగీటు వీడియోతో మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier) ఓవర్ నైట్ లో స్టార్ డమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ‘ఓరు అదార్ లవ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకుంది. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఫలితంగా మంచి ఆఫర్లు అందుకుంది. 
 

26

తెలుగులోనూ ఈ ముద్దుగుమ్మ మూడు చిత్రాల్లో నటించింది. ‘చెక్’, ‘ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’తో పాటు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ‘బ్రో’ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ చెల్లెలి పాత్రలో నటించింది. తనకు వచ్చిన ఆఫర్లు సరిగ్గా వినియోగించుకుంటోంది. ప్రస్తుతం మాత్రం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో సందడి చేస్తోంది. 

36

సినిమాల పరంగా కాస్తా ఆఫర్లను జమ చేసుకున్న ఈ బ్యూటీ ఇటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తూ ఆకట్టుకుంటోంది. గ్లామర్ విందుతోనూ మంత్రముగ్ధులను చేసింది. 
 

Related Articles

46

ఇటీవల ప్రియా ప్రకాశ్ వారియర్ కాస్తా స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్లలో మెరుస్తూ అట్రాక్ట్ చేస్తోంది. తన ఫ్యాషన్ సెన్స్ తో ఫిదా చేస్తోంది. మరోవైపు అందాల ప్రదర్శనతోనూ అదరగొడుతోంది. 

56

తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో దర్శనమిచ్చింది. పద్ధతిగా సంప్రదాయకమైన చీరను ధరించి ఆకట్టుకుంది. ప్రవహించే నదిలో జలకాలాడుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. అలాగే వొంపుసొంపులతోనూ మెస్మరైజ్ చేసింది. నడుము అందాలతో, టాప్ గ్లామర్ తో మంత్రముగ్ధులను చేసింది. 
 

66

చీరకట్టులో ప్రియా వారియర్ తడి అందాలను ప్రదర్శించడంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఆ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఇక ప్రియా ‘యారియన్2’తో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ ‘3 మంకీస్’, ‘లవ్ హ్యాకర్స్’, ‘శ్రీదేవి బంగ్లా’ వంటి సినిమాలు చేస్తోంది. అలాగే కన్నడలో ‘విష్ణు ప్రియా’ అనే చిత్రంలో నటిస్తోంది.
 
 

Read more Photos on
Recommended Photos