Superstar krishna: ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చాడు, డైరెక్టర్‌ చనిపోయాడు, అయినా కృష్ణ తగ్గలేదు.. ఇండస్ట్రీ రికార్డులన్నీ షెడ్డుకి

Published : Apr 04, 2026, 07:32 PM IST

ఎన్టీ రామారావు సినిమా చేయోద్దని వార్నింగ్‌ ఇచ్చాడు. సినిమా చేయాల్సిన దర్శకుడు మధ్యలోనే చనిపోయాడు. సూపర్‌ స్టార్‌ కృష్ణ చేసిన డేర్‌కి ఇండస్ట్రీ రికార్డులన్నీ షెడ్డుకి వెళ్లాయి. ఆ మూవీ ఏంటంటే? 

PREV
16
ఇండస్ట్రీలో డేరింగ్‌కి కేరాఫ్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ

సూపర్‌ స్టార్‌ కృష్ణ బాక్సాఫీసు రికార్డుల గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు, కానీ అప్పట్లో మాత్రం ఇండస్ట్రీని షేక్‌ చేశాడు. ఆయనొక ట్రెండ్‌ సెట్టర్‌. సినిమా పరంగా ఎంతో టెక్నాలజీని పరిచయం చేశారు. డేరింగ్‌ డెసీషన్‌తో ముందుకు వెళ్లారు. సక్సెస్‌ అయ్యారు. అంతేకాదు అనేక రికార్డులు క్రియేట్‌ చేశారు. మాస్‌, కమర్షియల్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్‌ తర్వాత కమర్షియల్‌, మాస్‌ యాక్షన్‌ మూవీస్‌ చేసి మెప్పించారు.

26
ఎన్టీఆర్ వార్నింగ్‌ ని లెక్కచేయని కృష్ణ

కృష్ణ డేరింగ్‌ స్టెప్‌కి నిదర్శనంగా ఎన్నో చిత్రాలున్నాయి. అయితే వాటిలో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్‌ చేసిన మూవీ ఒకటి ఉంది. ఆ సినిమా విషయంలో ఎన్టీఆర్‌కి, కృష్ణకి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఎన్టీఆర్‌ ఈ మూవీ చేయోద్దని హెచ్చరించాడు. ఈ సినిమాని ఎవరూ చూడరని చెప్పాడు. అయినా వినలేదు. అంతేకాదు షూటింగ్‌ స్టార్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత ఏకంగా దర్శకుడే చనిపోయాడు. దీంతో పెద్ద షాక్‌. అయినా తగ్గలేదు. తనే డైరెక్టర్‌గా మారాడు. సినిమాని రూపొందించాడు. దెబ్బకి అది ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్‌ చేసింది.

36
అల్లూరి సీతారామరాజుతో కృష్ణ డేరింగ్‌ స్టెప్‌

ఆ సినిమానే `అల్లూరి సీతారామరాజు`. ఈ కథతో ముందుగా ఎన్టీఆర్‌ సినిమా చేయాలనుకున్నారు. చాలా రోజులు స్క్రిప్ట్ పై కూర్చున్నారు. రైటర్స్ ని పెట్టి రాయించాడు కూడా. అయినా వర్కౌట్‌ కాలేదు. ఇలాంటి డ్రై సినిమాని ఎవరు చూస్తారని రామారావు వెనక్కి తగ్గాడు. రామారావు సినిమా చేస్తున్నాడని తెలిసి చాలా రోజులు వెయిట్‌ చేశాడు కృష్ణ. అయినా ఎలాంటి అప్‌ డేట్‌ లేదు. దీంతో డైరెక్ట్ గా ఎన్టీఆర్‌ని వెళ్లి కలిశాడు. అప్పుడు కూడా తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు రామారావు. దీంతో తాను చేస్తానని చెప్పగా, వద్దు, ఆ సినిమా ఆడదు, డబ్బులు పోగొట్టుకుంటావ్‌, సినిమాని ఎవరూ చూడరని హెచ్చరించాడు ఎన్టీఆర్‌. అయినా కృష్ణ వినలేదు. మొండిపట్టుదలతో ముందుకెళ్లాడు.

46
షూటింగ్‌ మధ్యలోనే దర్శకుడు చనిపోయాడు

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా కృష్ణ నటించారు. సీతగా విజయ నిర్మల, రూథర్‌ఫర్డ్ గా జగ్గయ్య, మేజర్ గూడాల్‌గా రాజనాల, అగ్గిరాజుగా ఎం బాలయ్య, పడాలుగా కాంతారావు, గంటం దొరగా గుమ్మడి నటించారు. వీ రామచంద్రరావు దర్శకత్వం వహించారు. త్రిపురనేని మహారథి రైటర్‌. పద్మాలయ స్టూడియోస్‌ పతాకంపై జి హనుమంతారావు, కృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా షూటింగ్‌ చాలా వరకు చింతపల్లి ఫారెస్ట్ లో జరిగింది. ఆ సమయంలో అక్కడే బస ఏర్పాటు చేసి చిత్రీకరించారు. షూటింగ్‌ సమయంలోనే దర్శకుడికి హార్ట్ ఎటాక్‌ వచ్చింది. ఆసుపత్రికి తరలించారు. దీంతో షూటింగ్‌ ఆగిపోయింది. కొన్ని రోజుల ట్రీట్‌మెంట్‌ తర్వాత దర్శకుడు చనిపోయాడు.

56
కృష్ణనే అల్లూరి సీతారామరాజుని డైరెక్ట్ చేశారు

దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితి. నిర్మాతలు, టీమ్‌ అంతా అయోమయంలో పడ్డారు. కానీ ధైర్యాన్ని కోల్పోలేదు. స్వయంగా ఆయనే దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని రూపొందించారు. వార్‌ ఎపిసోడ్లని కేఎస్‌ఆర్‌ దాస్‌ డైరెక్ట్ చేశారు. మొత్తంగా అంతా కలిసి సినిమాని కంప్లీట్‌ చేశారు. మే 1న మేడే సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఎవరూ ఊహించలేదు, ఈ మూవీకి ఈ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుంది. థియేటర్లలో ఆడియెన్స్ సినిమా చూసి ఊగిపోయారు. అల్లూరి సీతారామరాజుగా కృష్ణ విశ్వరూపం చూపించారు. ఆయన్ని అలా చూసి జనం థియేటర్లకి ఎగబడ్డారు. దీంతో మూవీ సంచలన విజయం సాధించింది.

66
టాలీవుడ్‌ ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్‌ చేసిన అల్లూరి సీతారామరాజు

ఈ సినిమా థియేటర్లలో 200 రోజులు ఆడింది. కోటి రూపాయల డిస్ట్రిబ్యూటర్‌ షేర్‌ని రాబట్టింది. ఆల్‌ టైమ్‌ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంతకు ముందు ఆయనకు దాదాపు తొమ్మిది సినిమాలు ఆడలేదు. `దేవుడు చేసిన మనుషులు` తర్వాత హిట్టే లేదు. అలాంటి సమయంలో కృష్ణ డేరింగ్‌తో చేసిన ఈ మూవీ ఇండస్ట్రీని ఊపేసింది. ఇలా ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చినా, దర్శకుడు చనిపోయినా, లెక్కచేయకుండా ధైర్యంతో ముందుకెళ్లి ఈ చిత్రాన్ని రూపొందించారు కృష్ణ. ఇండస్ట్రీ హిట్‌ ని అందుకున్నారు. ఇప్పుడీ మూవీ టాలీవుడ్‌ టాప్‌ మూవీస్‌లో ఒకటిగా నిలిచిందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories