హిందీ సినిమాల ద్వారా సినిమాల్లోకి వచ్చిన సిమ్రాన్, 1997లో తెలుగు, మలయాళం తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా పెద్దగా ఆడకపోయినా, త్వరగానే సౌత్ లో తనకంటూ తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు, విజయ్, సూర్య, అజిత్, కమల్ వంటి స్టార్ హీరోలందరితోనూ నటించింది.
చాలాకాలం పాటు ఆమె జతకట్టని ఏకైక హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. 'పేట' సినిమాతో ఆ కోరిక కూడా తీరింది. ఉత్తరాదిలో పెరిగినా, చీర, లంగా ఓణీ కడితే అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించేది. ఆ సహజమైన సౌత్ లుక్, ముక్కుపుడక మెరుపు, కళ్లలో కోపం, గుండెల్లో మాతృత్వం.. ఇవన్నీ సిమ్రాన్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. గ్లామర్ రోల్ అయినా, హోమ్లీ పాత్ర అయినా.. రెండింటికీ సరిగ్గా సరిపోయే హీరోయిన్ సిమ్రాన్.