ఫిల్మ్ ఇండస్ట్రీలో అతికొద్దిమంది హీరోలకు మూడు తరాలతో కలిసి నటించే అవకాశం వచ్చింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో ఇలా మూడు తరాల హీరోలు కలిసి నటించిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. కొడుకులు, మనవళ్ళతో కలిసి సినిమాలు చేసిన స్టార్ హీరోలు ఎవరంటే?
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ భాష ఏదైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు వారసులతో నిండిపోయి ఉంది. గతంలో తండ్రులు, తాతలు వేసిన బాటల్లో నడుచుకుంటూ, ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు కొంత మంది హీరోలు. వారసత్వానికి టాలెంట్ తోడై స్టార్ హీరోలుగా సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చినా కానీ.. టాలెంట్ నిరూపించుకోలేక ఇండస్ట్రీ నుంచి మాయమైపోయినవాళ్లు కూడా ఉన్నారు. అయితే కొన్ని కుటుంబాలు మాత్రం తమనటవారసత్వాన్ని నిలబెట్టుకుంటూ..మూడు తరాలుగా స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. వారిలో ఎన్టీఆర్, ఎన్నార్, లాంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈక్రమంలో మూడుతరాల హీరోలు కలిసి నటించిన అరుదైన తెలుగు సినిమాలు ఏవో తెలుసా?
24
ఎన్టీఆర్- బాలకృష్ణ - తారక్
తెలుగు సినిమా చరిత్రలో నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఈ కుటుంబం నుంచి మూడో తరం హీరోలు వెండితెరపై సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ వారసత్వం బాలయ్య నిలబెడితే, ఆతరువాత తరంలో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసత్వాన్ని తీసుకున్నాడు. లెజెండరీ ఎన్టీఆర్, ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఈ ముగ్గురు స్టార్స్ కలిసి ఓ సినిమాలో నటించారు. అయితే ఆ సినిమా రిలీజ్ కు నోచుకోలేదు. ఆమూవీ మరేదో కాదు బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఈ సినిమా తెలుగు వర్షన్ లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మిస్ అయ్యాడు. తారక్ ను హిందీ వెర్షన్ సినిమాలో నటింపచేశారు పెద్ద ఎన్టీఆర్. మేజర్ చంద్రకాంత్ చిత్రం షూటింగ్ సమయంలో తారక్ హిందీ మాట్లాడిన తీరుతో ముగ్ధుడైన ఎన్టీఆర్, వెంటనే ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వెర్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకున్నారట.ఈ సినిమాకు స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం కావడంతో, రాజకీయాల్లో ఈసినిమా పెద్ద ప్రకంపనలే సృష్టించింది. విశ్వామిత్రుడు పాత్రలో ఎన్టీఆర్ నటించగా, బాలకృష్ణ హరిశ్చంద్రుడు, దుష్యంతుడు పాత్రల్లో కనిపించాడు. జూనియర్ ఎన్టీఆర్ భరతుడు పాత్రలో కనిపించాడు. అంటే దుష్యంతుడు, శకుంతల కుమారుడి పాత్రలో నటించాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు.
34
అక్కినేని ఫ్యామిలీ మనం
ఆర్ధిక, ఆరోగ్య క్రమశిక్షణ కలిగిన హీరోలలో అక్కినేని నాగేశ్వారావు, ఆయన తనయుడు నాగార్జున ముందుంటారు. సినిమాల విషయంలో, ఆస్తులు విషయంలో , హెల్త్ విషయంలో వారి జాగ్రత్త వేరు. ఏఎన్నార్ ఆ క్రమశిక్షణవల్లే 90ఏళ్లకు పైగా జీవించారు. ఇక నాగార్జున ప్రస్తుతం 66 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. నాగార్జున ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా ఇదే ఫాలో అవుతుంటారు. ఇక ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించిన మూడు తరాల ఫ్యామిలీ చిత్రం మనం. ఈసినిమాను నాగార్జున పక్కాగా ప్లాన్ చేశాడు. అక్కినేని ఫ్యాన్స్ కు తమ ఫ్యామిలీ సినిమాతో కనులవిందు చేశారు. మనం సినిమా కోసం డిఫరెంట్ స్టోరీని రాసుకుని ఆకట్టుకున్నాడు దర్శకుడు. ఈసినిమాతో అఖిల్ వెండితెరపై హీరోగా మొదటి సారి కనిపించాడు. ఈమూవీ సూపర్ హిట్ అయ్యింది. మనం సినిమా రిలీజ్ అయిన కొంత కాలానికే ఏఎన్నారు కన్నమూశారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా తన తరువాత తరాలను ఇండస్ట్రీలోకి తీసుకువస్తున్నారు. మంచు వారసులగా ఇప్పటికే లక్ష్మీ, విష్ణు, మనోజ్ లు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ల మాదిరిగా మంచు వారసులు క్లిక్ అవ్వలేదు. కానీ సినిమాలు ప్లాప్ అయినా, హిట్ అయినా తమ పని తాము చూసుకుంటూ వెళ్తిపోతున్నారు. అయితే మోహన్ బాబు తరువాత విష్ణు ఇండస్ట్రీలో ఎక్కువ యాక్టీవ్ గా ఉన్నాడు. హీరోగా కోనసాగుతున్నాడు. ఇక రీసెంట్ గా మంచు విష్ణు వారసులు కూడా ఇండస్ట్రీలోకి వచ్చేశారు. ఆయన కూతుర్లు ఇద్దరు, చిన్న తనయుడు రీసెంట్ గా తెరంగేట్రం చేశాడు. మంచు విష్ణు ప్రయోగాత్మక చిత్రం కన్నప్పలో విష్ణ బిడ్డలు కూడా నటించారు. ఇదే సినిమాలో మోహన్ బాబు కూడా ఓ పాత్ర చేశారు. ఇలా కన్న ప్ప సినిమాలు మూడు తరాలు నటులు కనిపించడం విశేషం. ఇలా చాలామంది స్టార్స్ తమ తరువాత రెండు తరాల నటులతో నటించిన సందర్బాలు ఉన్నాయి.