Bigg Boss Telugu 8 : ఎన్టీఆర్, నాగార్జున మధ్య మమకారం.. బిగ్ బాస్ వేదికపై ఇద్దరూ ?

First Published | Aug 31, 2024, 9:12 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆదివారం సాయంత్రం ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ షోని ప్రతిసారి గత సీజన్ ని మించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి షోలో చాలా మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss Telugu Season 8

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆదివారం సాయంత్రం ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ షోని ప్రతిసారి గత సీజన్ ని మించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి షోలో చాలా మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ ఎవరు ? బిగ్ బాస్ లో ఉండబోయే మార్పులు ఏంటి ? లాంటి అంశాలు తెలుసుకునేందుకు ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. 

బిగ్ బాస్ షో ప్రారంభం అయ్యాక తమ సినిమా ప్రమోషన్స్ కోసం హీరోలు, హీరోయిన్లు, దర్శకులు బిగ్ బాస్ వేదికపైకి వస్తుంటారు. కొందరు స్టార్ హీరోలు కూడా హాజరవుతుంటారు. బిగ్ బాస్ షో ప్రారంభం అయ్యాక కొన్ని వారాలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్ 1 రిలీజ్ అవుతోంది. సో తారక్ అభిమానులైతే దేవర చిత్ర యూనిట్ బిగ్ బాస్ షోకి రావాలని కోరుతున్నారు. 


మరి ఎన్టీఆర్ వస్తాడో లేదో చూడాలి. ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ రావడం కష్టమే కావచ్చు. కానీ నాగార్జున, ఎన్టీఆర్ మధ్య మంచి అనుభందం ఉంది. ఒకరిపై ఒకరు మమకారం చూపిస్తుంటారు. నాగార్జున.. నందమూరి హరికృష్ణ ని తన సోదరుడిగా భావిస్తారు. 

తారక్ ని అయితే తన పెద్ద కొడుకుగా ప్రేమ కురిపిస్తాడు. పలు వేదికలపై నాగార్జున ఎన్టీఆర్ ని మా పెద్ద అబ్బాయి అని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, నాగార్జున ఇద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే ఫాన్స్ కి పండగే. మరి దేవర చిత్ర యూనిట్ బిగ్ బాస్ లో చిత్ర ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తుందో లేదో చూడాలి. ఒక వేళ ప్లాన్ చేసినా ఎన్టీఆర్ హాజరవుతాడా అనేది అనుమానమే. బాగ్ బాస్ తొలి సీజన్ కి హోస్ట్ గా చేసింది ఎన్టీఆర్ అనే సంగతి తెలిసిందే. 

Latest Videos

click me!