ఎన్టీఆర్ , ఎస్వీఆర్ మధ్య చిచ్చుపెట్టిన డైలాగ్ ఏదో తెలుసా? 3 ఏళ్లు ఇద్దరి మధ్య మాటలు ఎందుకు లేవు?

Published : Jan 14, 2026, 09:58 AM IST

తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్, ఎస్వీఆర్ లు మకుటంలేని మహారాజులుగా వెలిగినవారు. అటువంటి గొప్ప నటుల మధ్య ఒక చిన్న డైలాగ్ చిచ్చు పెట్టిందంటే నమ్ముతారా? అవును ఆ డైలాగ్ వల్ల వారిద్దరు 3 ఏళ్లు మాట్లాడుకోలేదట. ఇంతకీ ఏంటా సినిమా?

PREV
14
తెలుగు సినిమా గర్వించే నటులు...

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అద్భుతాలు చేసే నటులు చాలామంది ఉన్నారు. కాని చరిత్రలో నిలిచిపోయే మహానటులు మాత్రం కొందరే ఉన్నారు. ఆ లిస్ట్ లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో పాటు ఎస్వీ రంగారావు కూడా వస్తారు. ఒక రకంగా చెప్పాలంటే..ఎన్టీఆర్ నెలవారీ జీతానికి పనిచేస్తున్న టైమ్ లోనే.. ఎస్వీఆర్ రెమ్యునరేషన్ బేస్ మీద సినిమాలు చేసేవారట. 

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న నటుడిగా ఎస్వీఆర్ కు రికార్డు ఉంది. ఆయన సెట్ లో అడుగు పెడుతున్నాడంటే పరిస్థితి గంభీరంగా మారిపోయేది... ఎస్వీఆర్ డైలాగ్ చెప్పాడంటే..క్లాప్స్ పడాల్సిందే. ఎన్ని పేజిల డైలాగ్ ఇచ్చినా.. సింగిల్ టేక్ లో.. తనదైన స్టైల్ లో చెప్పగలగడం ఎస్వీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య.

24
ఎన్టీఆర్ - ఎస్వీఆర్ సెట్ లో ఉంటే అందరికి భయమే...

ఎస్వీ రంగారావు తరువాత ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్టీఆర్ కూడా అంతే... అప్పట్లోనే సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేశారు ఎన్టీఆర్. ఆయన కూడా ఎంత పెద్ద డైలాగ్ అయినా అలవోకగా చెప్పేవారు. పాత్రల విషషయంలో ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు ఎన్టీఆర్. అంతే కాదు హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, రైటర్ గా, మేకప్ విషయంలో కూడా ఎన్టీ రామారావు చేయి తిరిగిన వ్యక్తి. ఇక ఈ ఇద్దరు పెద్దమనుషులు ఒక సీన్ లో ఉన్నారంటే.. సెట్ లో అందరు భయం భయంగా ఉండేవారు. 

ఎన్టీఆర్ ఎస్వీఆర్ సీన్ అయిపోయేదాకా.. అందరికి టెన్షన్ తప్పదు. ఇద్దరు స్టార్స్ ఏదైనా పౌరాణిక సినిమా చేస్తూంటే.. ఇద్దరి సన్నివేశాలు ఒక దగ్గర ఉంటే.. పోటీ పడి నటించేవారు. పెద్ద పెద్ద డైలాగ్స్, పద్యాల అలవోకగా చెప్పేసేవారు. వీరి కాంబినేషన్ లో పాతాళభైరవి, మయాబజార్, పాండవనవాసం లాంటి అద్భుతమైన ఎన్నో సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.

34
ఎన్టీఆర్ - ఎస్వీఆర్ మధ్య డైలాగ్ వల్ల విభేదాలు

ఈ క్రమంలోనే.. ఒక సినిమాలోని ఒక డైలాగ్ వల్ల ఎన్టీఆర్ ఎస్వీఆర్ మధ్య విభేదాలు వచ్చాయని మీకు తెలుసా? డైలాగ్ విషయంలో మాట మాట అనుకుని ఇద్దరు మూడేళ్లు మాట్లాడుకోలేదట. అంతే కాదు ఎస్వీ రంగారావు అయితే తెలుగు సినిమాలు చేయడమే మానేశారట. ఇంతకీ ఆ గొడవకు కారణమైన సినిమా ఏదో కాదు పాండవనవాసం. అవును ఈసినిమాలో భీముడిగా ఎన్టీ రామారావు, దుర్యోధనుడిగా ఎస్వీ రంగారావు నటించారు. 

సభా సన్నివేశంలో ఇద్దరు స్టార్స్ ఎవరికి వారు తగ్గకుండా నటిస్తున్నారు. అప్పుడే ఎన్టీఆర్ నాలుగైదు నిమిషాల పద్యాన్ని అలవోకగా చెప్పేశారు. ఆ తరువాత కానీ ఎస్వీఆర్ కు నాలుగు పేజీల డైలాగ్ ఇచ్చారు. అప్పుడే ఆయన.. దర్శకుడితో ఇలా అన్నారట... ఆయన అంత పెద్ద పద్యం పాడిన తరువాత.. నేను కూడా ఇంత పెద్ద డైలాగ్ చెపితే ఏం బాగుంటుంది. నా స్టైల్ లో సింపుల్ గా చెపుతాను అన్నారట. దానికి దర్శకుడు కూడా ఒకే అనడంతో ఎస్వీఆర్ తన స్టైల్ లో డైలాగ్ చెప్పారు.

44
మూడేళ్లు మాట్లాడుకోవడం మానేసిన స్టార్స్

కానీ ఎన్టీఆర్ అందుకు ఒప్పుకోలేదు.. నేను ఇంత పెద్ద పద్యం పాడితే... మీరు అంత సింపుల్ గా చిన్న డైలాగ్ చెప్పి తీసేస్తే ఎలాగా.. సన్నివేశాం తేలిపోతుంది. నా డైలాగ్ కు వాల్యూ లేకుండా పోతుంది అని వాదించుకున్నారట. సెట్ లో ఈ విషయంలో మాట మాట పెరిగి.. ఎన్టీఆర్, ఎస్వీఆర్ మధ్య గొడవకు దారి తీసింది. అప్పటి నుంచి ఇద్దరు మాట్లాడుకోవడమే మానేశారు. 

ఎస్వీఆర్ అయితే తెలుగు సినిమాలు చేయను అని.. తమిళ సినిమాలు చేయడం మొదలు పెట్టారు. దాంతో పరిస్థితి గమనించిన స్టార ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర నాగిరెడ్డి.. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి.. మళ్లీ కలిసిపోయేలా చేశారాట. ఈ విషయాన్ని ఎస్వీఆర్ మనవుడు రంగారావు.. ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనకు కూడా ఈ విషయం ఇండస్ట్రీలో పెద్దలు చెపితే తెలిసిందని ఆయన అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories