Gunde Ninda Gudi Gantalu: ఓవైపు శివ, మరోవైపు ప్రభావతి.. బాలు, మీనా కాపురంలో చిచ్చు పెట్టేశారుగా..!

Published : Jan 14, 2026, 08:35 AM IST

 Gunde Ninda Gudi Gantalu: మీనా తమ్ముడు శివ.. ఎప్పుడూ ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు. ఎంత మారమని చెప్పినా వినిపించుకోడు. మరోసారి ఏదో పెద్ద తప్పు చేసి బాలుకి దొరికేలా ఉన్నాడు. మరి, నేటి ఎపిసోడ్ టీవీ కంటే ముందుగా మీకోసం.. 

PREV
14
Gunde Ninda Gudi Gantalu

శివ కొందరు రౌడీలతో కలిసి ఒక ఇంటికి వెళతాడు. అక్కడ వాళ్లను డబ్బులు ఇవ్వమని బెదిరించడానికి వెళతాడు.ఆ ఇంటి యజమాని ఇంట్లో ఉండడు. అతనికి ఫోన్ చేయమని ఆయన భార్యను బెదిరిస్తారు శివతో ఉన్న రౌడీలు. ఈవిడ కంగారుగా ఫోన్ చేయడంతో ఆ ఇంటి యజమాని వచ్చేస్తాడు.అయితే.. అతను బాలు క్యాబ్ లో రావడం విశేషం. కంగారులో క్యాబ్ దిగుతూ తన బ్యాగ్ తీసుకోవడం అతను మర్చిపోతాడు. అది చూసి బాలు ఇవ్వడానికి లోపలికి వెళతాడు. ఆ రౌడీలు డబ్బులు ఇవ్వమని బెదిరిస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవు అని బతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడే బాలు ఎంట్రీ ఇస్తాడు.బాలుని చూసి శివ షాక్ అవుతాడు. పనిలో పనిగా ఎక్కువగా మాట్లాడుతుంటే.. రౌడీలను బాలు నాలుగు పీకుతాడు. ఆ రౌడీలను తిట్టి, వార్నింగ్ ఇచ్చి మరీ వాళ్లను కొడతాడు. అంతేకాదు.. పోలీసులకు ఫోన్ చేయమని.. ఆ ఇంటి వ్యక్తికి బాలు సలహా ఇస్తాడు. అయితే.. ఆ రౌడీ మాట మారుస్తాడు. పోలీసులు వస్తే నేను మంచి నీళ్లు తాగడానికి వచ్చాను అని చెబుతాను అని ఆ రౌడీ అంటే.. నువ్వు ఇలాంటి పని చేస్తావనే.. నువ్వు బెదిరించినప్పుడు వీడియో రికార్డు చేశాను అని బాలు చెబుతాడు. అది విని రౌడీలు షాక్ అవుతారు. ఇక.. ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫోన్ చేయబోతుంటే.. ఆ రౌడీ కాస్త తగ్గి.. అక్కడి నుంచి వెళ్లిపోబోతాడు. కానీ.. బాలు ఆపి.. వాళ్లిద్దరికీ కలిపి నోట్ రాయిస్తాడు. బాలు స్వయంగా సాక్షి సంతకం కూడా పెడతాడు. వాళ్ల ప్రాబ్లం సాల్వ్ చేసి.. శివ సహా ఆ రౌడీలను అక్కడి నుంచి పంపేస్తాడు.

24
సుమతికి.. శ్రుతి గిఫ్ట్...

శ్రుతి.. సుమతిని కలవడానికి హాస్పిటల్ కి వస్తుంది. అయితే.. లోపలికి వెళ్లకుండా.. సుమతికి ఫోన్ చేసి బయటకు రమ్మని పిలుస్తుంది. శ్రుతి బయటకు రాగానే.. శ్రుతి కంగ్రాట్స్ చెబుతుంది. శ్రుతి ట్రీట్ కావాలని అడిగితే... మొదటి నెల జీతం రాగానే ఇస్తాను అని సుమతి అంటుంది. అయితే.. వద్దులే.. నీతో డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అని శ్రుతి అంటే.. ఇంత దూరం వచ్చి నాకు శుభాకాంక్షలు చెప్పావ్.. చిన్న ట్రీట్ ఇవ్వలేనా అని సుమతి అంటుంది. అయితే.. చిన్నది కాదు.. పెద్ద ట్రీటే తీసుకుంటానులే అని.. శ్రుతి.. సుమతికి ఒక బహుమతి ఇస్తుంది. బహుమతి చూసి.. సుమతి చాలా సంతోషిస్తుంది. తర్వాత.. ఇద్దరి మధ్యా పిల్లల టాపిక్ వస్తుంది. తాను పిల్లలను కనను అని శ్రుతి చెబుతుంది.. అయితే.. అమ్మతనం గురించి సుమతి చాలా గొప్పగా చెబుతుంది. అయినా సరే.. తాను సరోగసి ద్వారా పిల్లలు కంటాను కానీ... తాను మాత్రం ఆ నొప్పులు భరించను అని శ్రుతి చెబుతుంది. తర్వాత.. సరోగసి గురించి ప్రాసెస్ తెలుసుకోమని సుమతిని అడుగుతుంది. దానికి సుమతి కూడా సరే అంటుంది.

34
శివ పుట్టిన రోజు..

ఇక మరుసటి రోజు శివ పుట్టిన రోజు. తండ్రి ఫోటో దగ్గర శివ దండం పెట్టుకుంటాడు. గుడికి వెళ్లి అన్నదానం చేద్దామని వాళ్ల తల్లి అంటే... ఫ్రెండ్స్ పార్టీకి వెళ్లాలి అని శివ అంటాడు. కానీ తల్లి బలవంత పెట్టడంతో.. సరే అంటాడు. మీనా, బాలుకి ఫోన్ చేయమని ఆమె చెబితే... బాలుని పిలవను అని.. కేవలం వాళ్ల అక్కని మాత్రమే పిలుస్తాను అంటాడు. అదే సమయానికి మీనా.. తమ్ముడికి బర్త్ డే విషెస్ చెప్పడానికి వస్తుంది.మీనాని చూసి శివ చాలా హ్యాపీగా ఫీలౌతాడు.

కానీ.. గుడికి బాలు రావడం శివకు ఇష్టం లేదు అనే విషయాన్ని వాళ్ల అమ్మ..మీనాకు చెబుతుంది. దీంతో.. తన భర్తను పిలవరా అని మీనా కూడా హర్ట్ అవుతుంది. శివ మాట్లాడిన మాటలకు కోపం వచ్చి.. మీనా తమ్ముడిని తిడుతుంది. దానికి శివ ‘ నా చెయ్యి విరగగొట్టింది ఆయనే.. ఆ చెయ్యి నయం అయ్యినందుకు మొక్కు తీర్చుకుంటుంటే ఆయన్ని పిలవాలా?’ అని శివ కోపంగా అంటాడు. ‘ మా ఆయన ఏది చేసినా నీ మంచి కోసమే’ అని మీనా అన్నా.. శివ పట్టించుకోకుండా మీకు నచ్చినట్లు చేసుకోండి అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక.. మీనా కూడా.. తన భర్త రాకుండా గుడికి రాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

44
బాలు, మీనా మధ్య చిచ్చు పెట్టిన ప్రభావతి..

ఇంట్లో మీనా బట్టలు మడతపెడుతుంటే.. బాలు వస్తాడు. ప్రేమగా మీనా అని పిలుచుకుంటూ వస్తాడు. రెండో కారు కొన్న తర్వాత డబ్బులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి.. బాలు డబ్బులు మీనాకి ఇస్తాడు. అయితే.. మీనా వెళ్లిపోతున్న బాలుని ఆపి.. మీకు ఒక విషయం చెప్పాలి అంటుంది. ఏంటి? అని బాలు అడిగితే.. తన తమ్ముడు పుట్టిన రోజు విషయం చెబుతుంది.అయితే.. వాళ్ల అమ్మ గుడికి రమ్మన్న విషయం మీనా చెబుతుంది. కానీ.. బాలు అందుకు ఒప్పుకోడు.. కనీసం మీనాని కూడా వెళ్లొద్దని చెబుతాడు. శివ విషయంలో బాలు, మీనా లకు గొడవ జరుగుతుంది. తన తమ్ముడు మారిపోయాడు అని మీనా ఎంత నచ్చ చెప్పాలని చూసినా.. బాలు వినిపించుకోడు.‘భర్తకు మర్యాద లేని చోటికి భార్య వెళ్లకూడదు’ అని చెప్పు.. మీనాని కూడా వెళ్లొద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ మాటలకు మీనా చాలా బాధపడుతుంది. ఇక.. శివ, సుమతి, వాళ్ల అమ్మ గుడికి వెళతారు. అక్కడ ప్రసాదాలు చేయడానికి వాళ్లు రెడీ అవుతారు. కానీ, మీనా కోసం ఎదురుచూస్తూ ఉంటారు.అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

కమింగప్ లో.. బాలు వెళ్లొద్దు అన్నాడని మీనా ఆగిపోతే.. శ్రుతి వెళ్లమని సలహా ఇస్తుంది. శ్రుతి వెళ్లమంది కదా అని మీనా గుడికి వెళ్తుంది. ఆ విషయాన్ని కావాలని ప్రభావతి.. నెగిటివ్ గా బాలుకి ఎక్కిస్తుంది. దీంతో.. బాలు అక్కడికి వెళ్లి చూస్తాడు. బాలు, మీనా మధ్య ప్రభావతి పెట్టిన చిచ్చు బాగానే అంటుకునేలా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories