ఆర్ఆర్ఆర్ సందడి అయిపోయింది, ఇక తమ నెక్ట్స్ సినిమలపై దృష్టి పెట్టారు చరణ్ , తారక్. చరణ్ శంకర్ సినిమాతో బిజీగా ఉంటే.. ఎన్టీఆర్ కొరటాల సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. ఈసినిమా కోసం న్యూ లుక్ లో మెరవబోతున్నాడు తారక్.
కొరటాలతో సినిమాను ఎన్టీఆర్ ఎప్పుడో స్టార్ట్ చేయాల్సి ఉంది. కాని ఈసినిమా ఓపెనింగ్ రకరకాల కారణాల వల్ల డిలై అవుతూ వస్తోంది. ఇక ఈ సినిమాకు వచ్చే నెల ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది. అయితే సినిమా రెగ్యూలర్ షూటింగ్ వరకూ తారక్ తన శరీరాన్ని మార్పులు చేసుకోబోతున్నట్టు సమాచారం.
28
ఈమధ్య జూనియర్ ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష స్వీకరించారు. రీసెంట్ గా 21 రోజుల హనుమాన్ దీక్షను పూర్తి చేసుకున్నాడు. ఇక ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కబోయే తన 30వ ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నాడు ఎన్టీఆర్. దానికోసమే జిమ్ ట్రైనింగ్ కోసం రెడీ అవుతున్నారు.
38
కొరటాల సినిమాలో ఎన్టీఆర్ లుక్ డిఫరెంట్ గా ఉండబోతోందట. దాని కోసం ఆయన జిమ్ చేసి బరువు తగ్గి.. సినిమాకు తగ్గట్టు మార్చుుకోబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే తారక్ ఇప్పటికే జిమ్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. ఇప్పటికే కసరత్తులు స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.
48
ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఫిట్ గా కనిపించిన ఎన్టీఆర్.. సినిమా షూటింగ్ తరువాత చాలా రోజులు గ్యాప్ రావడంతో కాస్తంత ఒళ్లు చేశాడు. తన 30వ ప్రాజెక్టు కోసం ఇప్పుడు బరువు తగ్గించుకునే కసరత్తులు చేయనున్నట్టు ఆయన సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది.
58
అయితే ఎన్టీఆర్ స్పెషల్ లుక్ కోసం ఫేమస్ ఫిట్ నెస్ ట్రైయినర్ ను కూడా ఆయన ఇప్పటికే అపాయింట్ చేసుకున్నాడట. ట్రైయినర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్క్ అవుట్స్ చేస్తున్నారట. ఈ సారి ఎలాంటి కొత్త లుక్ లో తారక్ దర్శనం ఇస్తాడా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
68
ఎన్టీఆర్ 30వ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా కొరటాల శివ తెరకెక్కించనున్నారు. జూన్ లో సినిమా షూటింగ్ మొదలు కానుంది. మాస్ యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ మిక్సింగ్ తో ఈ సినిమా ఉంటుందని కొరటాల శివ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
78
సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా ఎన్టీఆర్ రెడీగా ఉంటారు. పాత్ర డిమాండ్ ను బట్టి.. ఎలాంటి కసరత్తులు చేయడానికైనా వెనకాడరు తారక్. ఆర్ఆర్ఆర్ కోసం ఇంతే కష్టపడ్డాడు. ఇప్పుడు కొరటాల సినిమా కోసం కూడా ఇదే కమిట్ మెంట్ తో పనిచేయబోతన్నాడు ఎన్టీఆర్.
88
ఇక ఈసినిమాలో హీరోయిన్ పై క్లారిటీ రాలేదు. ముందుగా ఆలియా భట్ అనుకున్నా.. ఆమెకు రణ్ బీర్ తో పెళ్లి కావడంతో ఈప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు రష్మికతో పాటు కీర్తి సురేష్ పేరు ఈసినిమా కోసం వినిపిస్తోంది.